కూటమి విజయంలో శ్రమించిన కార్యకర్తలకే స్థానిక ఎన్నికల్లో ప్రాధాన్యం: MLA గుమ్మనూరు జయరాం

గుంతకల్:- కూటమి పార్టీలు అధికారంలోకి రావడానికి శ్రమించిన కార్యకర్తలకే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ అవకాశాలు కల్పిస్తామని MLA గుమ్మనూరు జయరాం తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని PMR ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కూటమి బలపర్చడంపై, కార్యకర్తల పాత్రపై జయరాం మాట్లాడారు. కూటమి విజయానికి పునాది వేసిన కార్యకర్తల త్యాగం, కృషిని గుర్తించి స్థానిక ఎన్నికల్లో వారికి పెద్దపీట వేయాలని పార్టీలు సంకల్పించాయని ఆయన వివరించారు. గ్రామ, మండల, పట్టణ స్థాయిలో కూటమి బలపడాలంటే కార్యకర్తలే కీలకమని పేర్కొన్నారు.

కూటమిలో భాగంగా ఎవరికి అవకాశం వచ్చినా అందరూ కలిసికట్టుగా పని చేయాలని, వ్యక్తిగత ఆశలు, అభిరుచుల కంటే కూటమి లక్ష్యాలు ముందుండాలని ఆయన సూచించారు. నియోజకవర్గంలో కూటమి బలాన్ని మరింత పెంచేందుకు ప్రతి బూత్‌, ప్రతి గ్రామం, ప్రతి వార్డు స్థాయిలో సమన్వయంతో పని చేయాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు.

కూటమిలో భాగంగా ఎవరికి అవకాశం వచ్చినా అందరూ కలిసిగట్టుగా పని చేయాలి. ఎన్నికల్లో 100 శాతం గెలిచి నియోజకవర్గంలో కూటమి జెండా ఎగురవేయాలి.

ఎన్నికల్లో శాతం వందకు వంద గెలుపు సాధించాలంటే ప్రతి కార్యకర్త ఓటరును వ్యక్తిగతంగా కలవాలని, కూటమి ప్రభుత్వ పనితీరు, అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని జయరాం అభిప్రాయపడ్డారు. గుంతకల్లు నియోజకవర్గం కూటమికి బలమైన కోటగా నిలవాలని, ప్రతి నాయకుడు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

సమావేశంలో జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజు, ఎలక్షన్‌ అబ్జర్వర్‌ ఏరాసు ప్రతాప్‌ రెడ్డి, కార్మిక శాఖ బోర్డు ఛైర్మన్‌ వెంకట శివుడు యాదవ్‌, సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక స్థాయిలో కూటమి బలపర్చే చర్యలు, స్థానిక సంస్థల ఎన్నికల వ్యూహంపై ఈ సమావేశంలో చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.