రాయలసీమ న్యూస్, అనంతపురం: నార్పల మండలం బి. పప్పురు గ్రామంలో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం పరిస్థితులు, నీటి లభ్యతపై ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమం నిర్వహించారు. ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న బండారు శ్రావణి శ్రీ తెలిపారు.
వర్షాలు ఆలస్యం కావడం, వర్షపాతం తగ్గడం లేదా అసమానంగా కురిసే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో నీటి వినియోగంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని ఆమె సూచించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఎల్‌నినో ప్రభావం ఎలా ఉంది, వర్షాలు ఎలా కురుస్తున్నాయి, నీటి లభ్యతలో ఎలాంటి మార్పులు కనిపిస్తున్నాయి, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటనే అంశాలను ఆమె ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.

గ్రామస్థులు తమ ప్రాంతంలో నీటి పరిస్థితులు, ఎదురవుతున్న సమస్యలను బండారు శ్రావణి శ్రీ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం రచ్చబండ వద్ద నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవడం, వ్యవసాయంలో నీటి వృథాను అరికట్టడం, పంటలకు అవసరమైన నీటిని సమర్థంగా వినియోగించడం వంటి అంశాలపై ప్రజలకు వివరించారు.
ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గితే పంటలకు అవసరమైన నీటి లభ్యతపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. రైతులు పంటలకు అవసరమైన నీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని, నీటి వృథాను అరికట్టాలని, అందుబాటులో ఉన్న నీటిని పంటల అవసరాలకు అనుగుణంగా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

అధికారులు గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం పరిస్థితులు, నీటి లభ్యతపై ప్రజలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని బండారు శ్రావణి శ్రీ సూచించారు. ముఖ్యంగా రైతులకు నీటి పొదుపు, పంటల సంరక్షణ, అందుబాటులో ఉన్న నీటిని సమర్థంగా వినియోగించుకునే విధానాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

ఇంటి అవసరాల్లో నీటి వృథాను తగ్గించడం, వర్షపు నీటిని సంరక్షించుకోవడం, వ్యవసాయంలో నీటి వినియోగాన్ని సమర్థంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్ నీటి సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా గ్రామంలో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా, వెంటనే పరిష్కరించాలంటూ సంబంధిత అధికారులను బండారు శ్రావణి శ్రీ ఆదేశించారు.

ఇంటి అవసరాల్లో నీటి వృథాను తగ్గించడం, వర్షపు నీటిని సంరక్షించుకోవడం, వ్యవసాయంలో నీటి వినియోగాన్ని సమర్థంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్ నీటి సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునివ్వడం జరిగింది.
ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి ప్రజలతో నేరుగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా వారు పలు సమస్యలను నా దృష్టికి తీసుకురాగా వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించడం జరిగింది.
- బండారు శ్రావణి శ్రీ













