అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం ఉప్పరపల్లి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది. చిన్నగొల్లపల్లి గ్రామానికి చెందిన రవి, జయ ఈ ప్రమాదంలో మృతి చెందినట్లు సమాచారం.

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత అధికారులు, మండల తెలుగు దేశం పార్టీ నాయకులు, బాధిత కుటుంబ సభ్యులతో చరవాణి ద్వారా మాట్లాడి తెలుసుకున్నట్లు సమాచారం. ప్రమాదానికి కారణమైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను కోరారు. అలాగే ఈ విషాద ఘటనపై సమగ్ర విచారణ నిర్వహించి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు.

మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని ప్రయత్నించినట్లు తెలుగు దేశం పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ కష్టకాలంలో తెలుగు దేశం పార్టీ , కూటమి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చినట్లు పార్టీ నేతలు తెలిపారు.

జిల్లా యంత్రాంగం బాధిత కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు, అవసరమైన అన్ని విధాల మద్దతు అందించాలని సుగవాసి ప్రసాద్ బాబు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా రోడ్డు భద్రతపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ తీరని దుఃఖాన్ని భరించే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.తెలుగు దేశం పార్టీ , కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ బాధిత కుటుంబాల పక్షాన నిలుస్తుందని నాయకులు స్పష్టం చేశారు.