రాయచోటి: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ – జనసేన – భారతీయ జనతా పార్టీ NDA కూటమి అభ్యర్థుల విజయానికి మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐకమత్యంతో సమిష్టిగా కృషి చేయాలని రాజంపేట జనసేన పార్లమెంట్ సమన్వయకర్త దారం అనిత పిలుపునిచ్చారు. శనివారం రాయచోటి స్టేట్ గెస్ట్ హౌస్ లో నిర్వహించిన కూటమి నాయకుల సమన్వయ సమావేశంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన పలు అంశాలపై చర్చ జరిగింది.

సమావేశంలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, స్థానిక పరిస్థితులు, మూడు పార్టీల మధ్య సమన్వయం, ఎన్నికల కార్యాచరణపై నాయకులు విస్తృతంగా చర్చించారు. సీటు ఎవరికొచ్చిందనేది ముఖ్యం కాదని, కూటమి అభ్యర్థి గెలుపే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని దారం అనిత సూచించారు.

ఒక పార్టీకి సీటు కేటాయించిన వార్డులో మిగిలిన రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కూడా పూర్తి సహకారం అందించాలని ఆమె కోరారు. బూత్ స్థాయి నుంచి వార్డు, మున్సిపల్ స్థాయి వరకు మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సమావేశంలో పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. వ్యక్తిగత అభిప్రాయాలు, చిన్నచిన్న విభేదాలను పక్కనపెట్టి కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ముందుకు సాగాలని నాయకులు సూచించారు.

ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి BC Janardhan Reddy, Zonal Committee Chairman Damacharla Satya, Rajampet Parliament TDP అధ్యక్షులు, TTD పాలకమండలి మాజీ సభ్యులు Sugavasi Prasad Babu, Mandipalli Lakshmi Prasad Reddy, Nagothu Ramesh, Atikari Krishna, Tatamshetti Nagendra, Tamballapalli TDP ఇన్‌చార్జి Shankar Yadav, Punganur TDP ఇన్‌చార్జి Madhusudan Naidu, Narendra, Challapalli Narasimhareddy తదితర TDP–Janasena–BJP కూటమి నాయకులు పాల్గొన్నారు.