నంద్యాల పార్లమెంట్ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ దళిత కాలనీ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడమే తన లక్ష్యమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు.

శనివారం నంద్యాల జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలోని పగిడ్యాల మండలం పాత ముచ్చుమర్రి గ్రామ బస్టాండ్ సెంటర్‌లో నంద్యాల ఎంపీ నిధులతో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను డాక్టర్ బైరెడ్డి శబరి ప్రారంభించారు.

నంద్యాల పార్లమెంట్ ప్రజలకు, ముఖ్యంగా గ్రామీణ దళిత కాలనీ ప్రజలకు స్వచ్చమైన తాగునీరు అందించడమే లక్ష్యం.

ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, ఎంపీ నిధులతో గ్రామాల్లో, ముఖ్యంగా దళిత, బడుగు బలహీన వర్గాల కాలనీలలో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నామని పేర్కొన్నారు. మినరల్ వాటర్ ప్లాంట్ల నిర్మాణాలకు నిధుల కొరత లేదని ఆమె స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల్లో శుద్ధి చేసిన తాగునీరు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె వివరించారు. దళిత, బడుగు బలహీన వర్గాల కాలనీలకు ప్రాధాన్యతనిస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

పాత ముచ్చుమర్రి గ్రామ బస్టాండ్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా స్థానిక ప్రజలకు తక్కువ ధరకు స్వచ్ఛమైన తాగునీరు లభించనుందని, గ్రామంలో నీటి ద్వారా వ్యాపించే వ్యాధులను తగ్గించే దిశగా ఇది ఉపయోగపడుతుందని కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో ముచ్చుమర్రి టీడీపీ సీనియర్ నాయకులు కాటం వెంకటరామిరెడ్డి, రాఘవరెడ్డి, విద్యార్థి సంఘం నాయకులు కుమ్మరి నాగరాజు, సుబ్బారావు, బాలనారాయణ, నాగేశ్వరావు, చిన్న సుంకన్న, రాముడు, మాజీ మున్సిపల్ చైర్మన్ డి. సుధాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ నాగేశ్వరావు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ కాకరవాడ చిన్న వెంకటస్వామి, కట్టుబడి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.