రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: పెనుకొండ క్యాంపు కార్యాలయంలో పెనుకొండ మున్సిపాలిటీకి చెందిన నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టణంలో ఇప్పటికే కొనసాగుతున్న అభివృద్ధి పనులు, త్వరలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.
పెనుకొండ పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మరింత మెరుగుపరిచేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని నాయకులకు సూచించారు. వార్డుల వారీగా ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి కృషి చేయాలని సమావేశంలో పేర్కొన్నారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరికొద్ది రోజుల్లో నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్న నేపథ్యంలో, నాయకులు, కార్యకర్తలు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి వార్డులో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, ప్రజలతో నిరంతరం మమేకమై ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
పెనుకొండ మున్సిపాలిటీలోని అన్ని వార్డులను కూటమి కైవసం చేసుకునేలా సమష్టిగా పనిచేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. ప్రజల ఆశీస్సులతో పట్టణంలోని ప్రతి వార్డులో కూటమి అభ్యర్థులను గెలిపించేలా ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో పెనుకొండ మున్సిపాలిటీకి చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు.













