9న సీఎం చంద్రబాబు పర్యటనకు ఏర్పాట్లు పూర్తి

ఈ నెల 9వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనను దృష్టిలో ఉంచుకుని జిల్లా పరిపాలన యంత్రాంగం ఏర్పాట్లను ముమ్మరం చేసింది. తిరుచానూరు పరిధిలోని దామినేడు వద్ద నిర్వహించనున్న బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానుండటంతో అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. పూరపూర్తి ిల్లా కలెక్టర్ డా ఎస్. వెంకటేశ్వర్ సోమవారం దామినేడు సభాస్థలిని సందర్శించి ఏర్పాట్ల పురోగతిని సమీక్షించారు. ఆయనతో పాటు జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, తెదేపా బోర్డు సభ్యురాలు పనబాక లక్ష్మి తదితరులు ఉన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సభా ప్రాంగణం, వేదిక, ప్రజల రాకపోకలు, వాహనాల పార్కింగ్‌ వంటి అంశాలను పరిశీలించారు.

సీఎం పర్యటన సందర్భంగా విధులు నిర్వర్తించాల్సిన అధికారులకు కలెక్టర్ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఎలాంటి లోటుపాట్లు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, ప్రతి విభాగం తన తన బాధ్యతలను స్పష్టంగా తెలుసుకుని అమలు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా సభా ప్రాంగణం చుట్టుపక్కల శుభ్రత, రహదారి సౌకర్యాలపై దృష్టి పెట్టాలని సూచించారు.

సభకు హాజరయ్యే ప్రజలకు తాగునీటి సదుపాయం సమృద్ధిగా ఉండేలా చూడాలని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత శాఖల అధికారులకు సూచనలు జారీ చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని, అవసరమైన జనరేటర్లు, లైటింగ్‌ సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు.

అత్యవసర వైద్య సేవల కోసం అంబులెన్సులు, వైద్య బృందాలు, తాత్కాలిక వైద్యశిబిరం వంటి ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. భద్రతా చర్యల విషయంలో ఎస్పీతో కలిసి సమీక్ష నిర్వహించి, పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నిర్వహణపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించారు. ముఖ్యమంత్రి రాక, వెళ్లే మార్గాల్లో ట్రాఫిక్‌ను సక్రమంగా నియంత్రించేందుకు ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు.

సీఎం పర్యటనలో ఎలాంటి అంతరాయం లేకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా అన్ని మౌలిక సదుపాయాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రతి విభాగం సమన్వయంతో పనిచేస్తేనే కార్యక్రమం విజయవంతం అవుతుందని, అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.