శ్రీకాళహస్తిలో ఆగస్టు రెండో తేదీన నిర్వహించనున్న మెగా మెడికల్ క్యాంపును విజయవంతం చేయాలని శ్రీకాళహస్తి డిఎస్పి ఎన్ఎస్ మూర్తి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ క్యాంపు శ్రీకాళహస్తిలోని ఆర్ పి జడ్పీ బాయ్స్ స్కూల్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ఆయన వివరించారు.

ఈ సందర్భంగా శ్రీకాళహస్తి వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి డిఎస్పి ఎన్ఎస్ మూర్తి వివరాలు వెల్లడించారు. ఆగస్టు రెండో తేదీన శ్రీకాళహస్తిలోని ఆర్పిబిఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో డిఎన్ఆర్ హాస్పిటల్స్ సిబ్బంది ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ మెడికల్ క్యాంపు శ్రీకాళహస్తి స్వర్ణముఖి నది తీరంలో ఉన్న హజరత్ జుoలెషావలి పీర్ దర్గా ఉరుష్ కమిటీ చైర్మన్ ఓరుగంటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించబడనుందని డిఎస్పి వివరించారు. క్యాంపు నిర్వహణలో కమిటీ సభ్యులు, వైద్య సిబ్బంది సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు.

క్యాంపులో పోలీసులు మరియు విలేకరుల కోసం వివిధ రకాల ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు డిఎస్పి ఎన్ఎస్ మూర్తి తెలిపారు. రక్తపోటు, మధుమేహం వంటి సాధారణ పరీక్షలతో పాటు ఇతర అవసరమైన పరీక్షలు కూడా చేయాలని డిఎన్ఆర్ హాస్పిటల్స్ వైద్య బృందం ప్రణాళిక రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు.

పరీక్షల అనంతరం అవసరమైన ఔషధాలను ఉచితంగా అందజేసే విధంగా కార్యాచరణ చేపట్టినట్లు డిఎస్పి వివరించారు. పోలీసు సిబ్బంది, ప్రెస్ ప్రతినిధుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలిపారు.

ఈ అవకాశాన్ని పోలీసులు, ప్రెస్ సిబ్బంది మాత్రమే కాకుండా, వారి కుటుంబ సభ్యులు కూడా సద్వినియోగం చేసుకోవాలని డిఎస్పి ఎన్ఎస్ మూర్తి సూచించారు. ఆరోగ్య పరీక్షలకు పెద్ద సంఖ్యలో హాజరై క్యాంపును విజయవంతం చేయాలని ఆయన కోరినట్లు సమావేశంలో పాల్గొన్న అధికారులు తెలిపారు.