రాయలసీమ న్యూస్, తిరుపతి: తిరుపతి నగరంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ ఇంటిపై అలిపిరి పోలీసులు దాడి చేసి, ఆర్గనైజర్‌తో పాటు ముగ్గురు విటులను అరెస్ట్ చేశారు. ఇద్దరు మహిళలను రక్షించి హోమ్‌కు తరలించారు. ఈ ఘటన అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని అక్కారం పల్లి సమీపంలో చోటుచేసుకుంది.

అక్కారం పల్లి సమీపంలోని ఓ ఇంటిలో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం పోలీసులకు అందింది. వెంటనే స్పందించిన అలిపిరి పోలీసులు అక్కడ దాడి నిర్వహించారు. అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను గుర్తించిన పోలీసులు, అక్కడ ఉన్నవారిని అదుపులోకి తీసుకున్నారు.
పట్టుబడిన వారిలో ఆర్గనైజర్‌తో పాటు ఇరువురు మహిళలు, ముగ్గురు విటులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో నిర్వహించిన తనిఖీల్లో 1500 రూపాయల నగదు, 10 కండోమ్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ కేసులో A1గా సత్యనారాయణపురం రాజీవ్ నగర్‌కు చెందిన ఆర్గనైజర్ M. అలివేలు మంగమ్మను, A2గా STV నగర్‌కు చెందిన U. గోవర్ధన్‌ను, A3గా కార్వేటినగరం గోపిశెట్టిపల్లికి చెందిన T. తిరువేసును, A4గా నారాయణవనం మండలం అరణ్యకండ్రికకు చెందిన G. సాయిబాబును పోలీసులు అరెస్ట్ చేశారు.
అరెస్ట్ చేసిన నిందితులను కోర్టు ముందు హాజరుపరచి, రిమాండ్‌కు తరలించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు అలిపిరి సిఐ రామకిషోర్ వెల్లడించారు. ఈ దాడితో ఆ ప్రాంతంలో కొనసాగుతున్న వ్యభిచార కార్యకలాపాలకు కొంతవరకు అడ్డుకట్టపడినట్లు పోలీసులు భావిస్తున్నారు.













