గోపవరం భగత్ సింగ్ కాలనీలో కూటమి పాలన రెండు ఏళ్ల నమ్మకం కార్యక్రమం

కూటమి పాలన రెండు ఏళ్ల నమ్మకం, అభివృద్ధి–సంక్షేమం డోర్ టు డోర్ కార్యక్రమం ప్రొద్దుటూరు మండల పరిధిలోని గోపవరం గ్రామ పంచాయతీ భగత్ సింగ్ కాలనీలో నిర్వహించారు. బూత్ నెంబర్ 224 పరిధిలో ఇంటింటికీ తిరిగి ప్రజల సంక్షేమం, అభివృద్ధి అమలుపై సమీక్ష చేపట్టారు.

కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సంబంధిత లబ్ధిదారులకు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. అలాగే గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజల అభిప్రాయాలు, సమస్యలను నమోదు చేశారు.

కొన్ని కారణాల వల్ల ఇప్పటివరకు సంక్షేమ పథకాలు అందని లబ్ధిదారులను గుర్తించి, వారికి ఏ కారణం వల్ల పథకాలు అందలేదో సంబంధిత అధికారుల ద్వారా వివరాలు సేకరించారు. ఆ లోపాలను సరిదిద్దేలా చర్యలు తీసుకుని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు చేరేలా చూడాలని అధికారులను ఆదేశించినట్లు కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు తెలిపారు.

ఈ డోర్ టు డోర్ కార్యక్రమంలో స్థానిక నాయకులు మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, బచ్చల ప్రతాప్, అల్లాబకాష్, పీరా, కాలే, శంకర్, అల్తాఫ్, లక్ష్మీ రెడ్డి, ఇనాయతుల్ల, మల్లెల భాస్కర్, దొడియం సుబ్బారెడ్డి, ఈశ్వర్ రెడ్డి, సునీల్, అంజి, పల్లె గురివి రెడ్డి, కొండయ్య, వెంకట రాముడు, డానియేలు, సుధాకర్, ఓబులేసు, నరసింహ, కుళ్ళు శీను, కుళాయి రెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, GC పుల్లయ్య, రమణయ్య యాదవ్, ధనుంజయ ఆచారి, UGL సీను, సీను, పెండేకంటి, ఆచార్య కాలనీ లక్ష్మీ, భవాని తదితరులు పాల్గొన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర షేక్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, TDP రాష్ట్ర ప్రధాన కార్యదర్శి Vs ముక్తియార్, TDP ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిశీలకులు కొండవీటి భావన, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు బద్వేలు శ్రీనివాసుల రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ భర్త & మాజీ కౌన్సిలర్ వద్ది బాలుడు, TDP కడప పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి వై.యస్ జబివుల్లా, BJP జిల్లా కార్యదర్శి కోనేటి ప్రదీప్, జనసేన నాయకులు మంచి శివకుమార్, జిలాన్, రిటైర్డ్ Si శంకర్ తదితరులు కూడా పాల్గొన్నారు.

కూటమి పాలన రెండేళ్లలో అమలైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడం, ఇంకా ప్రయోజనం పొందని అర్హుల్ని గుర్తించి వారికి పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం ఈ డోర్ టు డోర్ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా నిర్వాహకులు పేర్కొన్నారు.