బద్వేల్ మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహక సమావేశంలో టీడీపీ బద్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మరియు ఉమ్మడి కడప జిల్లా DCCB చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని తెలుగుదేశం పార్టీ నాయకులతో ఆయన ఆధ్వర్యంలో ఈ సన్నాహక సమావేశం నిర్వహించారు.

రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయాన్ని లక్ష్యంగా పెట్టుకుని నాయకులు, కార్యకర్తలు అందరూ ఐకమత్యంతో, కలిసికట్టుగా పనిచేయాలని మంచూరు సూర్యనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతి వార్డులో పార్టీని మరింత బలోపేతం చేస్తూ, ప్రజలతో మమేకమై కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరాన్ని ఆయన నాయకులకు సూచించారు.

నాయకుల ఐకమత్యం, కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదం కలిసొస్తే బద్వేల్ మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేయడం సాధ్యమవుతుందని మంచూరు సూర్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. బద్వేల్ మున్సిపాలిటీని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.

బద్వేల్ మున్సిపాలిటీ ప్రజలు రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టడం ఖాయమనే నమ్మకం వ్యక్తం చేసిన మంచూరు సూర్యనారాయణ రెడ్డి, పార్టీ శ్రేణులు మరింత చురుకుగా పనిచేసి ప్రజల మద్దతును సంపాదించాలని సూచించారు.