రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: జమ్మలమడుగు: జనసేన పార్టీ జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ స్థానిక సంస్థల ఎన్నికల సమన్వయకర్తగా దేరంగుల జగదీష్‌ను నియమించింది. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేయడం, నాయకులు, కార్యకర్తలతో అనుసంధానం కల్పించడం, ఎన్నికల వ్యూహరచన వంటి బాధ్యతలను ఆయన నిర్వర్తించనున్నారు.
ఈ నియామకాన్ని పార్టీ వర్గాలు కీలకంగా భావిస్తున్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం, స్థానిక సంస్థలలో పార్టీ ఆధిపత్యం పెంపు లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన జనసేన పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు.
పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, జనసేన పార్టీ అభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి, స్థానిక సంస్థల బలోపేతానికి అంకితభావంతో కృషి చేస్తాను.
పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నాయకులు, జనసైనికులను సమన్వయం చేసుకుని పార్టీ విజయానికి కృషి చేస్తాను.
ప్రజాసేవే లక్ష్యంగా, పార్టీ అధిష్ఠానం తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి నిరంతరం పనిచేస్తాను.
జగదీష్ నియామకంతో జమ్మలమడుగు నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకలాపాలకు మరింత చైతన్యం వస్తుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి అనుకూల వాతావరణం సృష్టించేందుకు ఆయన సమన్వయకర్తగా కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
జమ్మలమడుగు పరిధిలో గ్రామ, మండల, పట్టణ స్థాయి స్థానిక సంస్థలలో పార్టీ బలోపేతం, ప్రజలతో అనుబంధం పెంపు, యువత, మహిళల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా జగదీష్ కార్యాచరణను ముందుకు తీసుకెళ్లనున్నట్టు పార్టీ నాయకులు చెబుతున్నారు. జనసేన సిద్ధాంతాలను ప్రజలకు చేరవేసే బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తానని ఆయన మద్దతుదారులకు హామీ ఇస్తున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.













