కడపలో నిర్వహించిన RXS జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అవసరమని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ శైలజ రాయపతి , మహిళా క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ, గుర్తింపు పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా క్రీడల అభివృద్ధి, యువ క్రీడాకారిణులకు లభిస్తున్న అవకాశాలు, రాష్ట్రం నుంచి జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రతిభ గురించి ఈ సందర్భంగా చర్చించారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఆక్టర్ నిధి అగర్వాల్ మహిళా సాధికారత, మహిళా క్రికెట్ ప్రాధాన్యం, కుటుంబం మరియు సమాజం పాత్రపై తన అభిప్రాయాలను వెల్లడించారు. మహిళలు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని అందులో ముందుకు సాగేందుకు అవసరమైన మద్దతు, ప్రోత్సాహం అందించాల్సిన అవసరాన్ని ఆమె ఉటంకించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువ క్రీడాకారిణులు భవిష్యత్తులో భారత జాతీయ క్రికెట్ జట్టులో స్థానం సంపాదించాలని తన ఆకాంక్షను వ్యక్తం చేశారు.

మహిళా క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అవసరం. కడపలో జరిగిన RXS జెర్సీ లాంచ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. మహిళా క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ, గుర్తింపు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రతిభ ఉన్న యువ క్రీడాకారిణులను కుటుంబం, సమాజం మరింతగా ప్రోత్సహించాలి.

మహిళా సాధికారత అంటే ఒక అమ్మాయి తాను ఇష్టపడిన రంగంలో ముందుకు వెళ్లేలా ప్రోత్సహించి, చివరి వరకు ఆమెకు అండగా నిలవడం. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరింత మంది క్రీడాకారిణులు భవిష్యత్తులో భారత జాతీయ క్రికెట్ జట్టులో చోటు సంపాదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. RXS జట్టుకు మరిన్ని విజయాలు సొంతం కావాలని కోరుకుంటున్నాను.

కార్యక్రమంలో RXS జట్టుకు సంబంధించిన కొత్త జెర్సీని ఆవిష్కరించడంతో పాటు, జట్టు భవిష్యత్ ప్రణాళికలు, లక్ష్యాలపై కూడా చర్చ జరిగింది. రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదగాలన్న లక్ష్యంతో RXS జట్టు సిద్ధమవుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు, జట్లకు లభించే కార్పొరేట్ మద్దతు ఎంతో ఉపయోగకరమని పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.

కడపలో జరిగిన ఈ జెర్సీ లాంచ్ కార్యక్రమం ద్వారా మహిళా క్రికెట్‌కు మరింత గుర్తింపు లభించడంతో పాటు, యువతిలో క్రీడలపై ఆసక్తి పెంపొందుతుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి మరిన్ని మహిళా క్రికెటర్లు వెలుగులోకి రావడానికి కుటుంబాలు, విద్యాసంస్థలు, క్రీడా సంఘాలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా పలువురు స్పష్టం చేశారు.