రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడపలోని యోగి వేమన యూనివర్సిటీ లా పూర్వ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న అన్ని సబ్జెక్టులను ఒకేసారి రాసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు వన్‌టైం ఆపర్చునిటీ కింద నవంబర్‌లో జరగబోయే అన్ని సెమిస్టర్ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
విశ్వవిద్యాలయం ప్రకటించిన వివరాల ప్రకారం 3Y లా కోర్సులో 2010-2019 బ్యాచులు, 5Y లా కోర్సులో 2010-2015 బ్యాచుల్లో చదివిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇప్పటివరకు క్లియర్ చేయని పెండింగ్ సబ్జెక్టులను ఒకేసారి రాసుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక పరీక్షలను నిర్వహించనున్నట్లు యోగి వేమన యూనివర్సిటీ స్పష్టం చేసింది.
పరీక్షా ఫీజులు మరియు ఇతర వివరాల కోసం విద్యార్థులు తమ తమ కాలేజీలను సంప్రదించాలని యోగి వేమన యూనివర్సిటీ సూచించింది. సంబంధిత కాలేజీలు ఫీజు నిర్మాణం, పరీక్షా తేదీలు, హాల్ టికెట్ల జారీ, టైమ్‌టేబుల్ వంటి అంశాలపై విద్యార్థులకు పూర్తి సమాచారం అందించనున్నాయి.
ఈ వన్‌టైం ఆపర్చునిటీని యోగి వేమన యూనివర్సిటీ చిట్టచిరి అవకాశంగా పేర్కొంది. గతంలో లా కోర్సు పూర్తి చేయలేకపోయిన, కొన్ని సబ్జెక్టులు పెండింగ్‌లో ఉన్న విద్యార్థులకు ఇది చివరి అవకాశం కావడంతో, తప్పక వినియోగించుకోవాలని విశ్వవిద్యాలయం సూచించింది.
నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతలు, షరతులు, చివరి తేదీలను విద్యార్థులు జాగ్రత్తగా పరిశీలించి, ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేసుకోవాలని విశ్వవిద్యాలయం అధికారులు సూచిస్తున్నారు. నవంబర్‌లో జరగబోయే ఈ పరీక్షల ద్వారా పూర్వ బ్యాచుల విద్యార్థులు తమ లా కోర్సును పూర్తి చేసుకునే అవకాశం లభించనుంది.
విద్యార్థులు తమ కాలేజీల ద్వారా లేదా యోగి వేమన యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా నోటిఫికేషన్ పూర్తి వివరాలను తెలుసుకుని, అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యా వర్గాలు పేర్కొంటున్నాయి.













