రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: మైదుకూరు పట్టణంలో సెప్టెంబరు 9న భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ తెలిపారు. ఏపీఎస్ఎస్ఓసీ, జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ జాబ్ మేళా ఉదయం 9 గంటలకు మైదుకూరులోని శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాలలో ప్రారంభం కానుంది.
ఈ జాబ్ మేళాలో అరబిందో ఫార్మా గ్రూప్, గ్రీన్ టెక్, డిక్సన్, శ్రీరామ్ చిట్స్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, మానవత ట్రాన్స్పోర్టు, ఎల్బీసీ ఆఫ్ ఇండియా తదితర పది ప్రముఖ సంస్థల ప్రతినిధులు పాల్గొననున్నారని ఆయన వివరించారు. వివిధ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థలు ప్రత్యక్షంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నట్లు తెలిపారు.
టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈ జాబ్ మేళాలో పాల్గొనేందుకు అర్హులని సురేష్ కుమార్ పేర్కొన్నారు. అభ్యర్థుల వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉండాలని స్పష్టం చేశారు.
జాబ్ మేళాకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ వంటి అవసరమైన పత్రాలు, పాస్‌పోర్టు సైజు ఫోటోలు వెంట తీసుకురావాలని జిల్లా ఉపాధి కార్యాలయం సూచించింది. సంస్థల అవసరాలకు అనుగుణంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించబడుతుందని అధికారులు తెలిపారు.
మరిన్ని వివరాల కోసం నరసింహులు (91823 35843), శివకృష్ణ (93983 48760)లను సంప్రదించాలని ఉపాధి కల్పనాధికారి కోరారు. స్థానిక యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధి శాఖ అభిలషిస్తోంది.













