రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు: భారతీయ జనతా పార్టీ సేవా సంకల్ప అభియాన్‌లో భాగంగా ప్రొద్దుటూరులోని రామేశ్వరము మెర్జ్ అంగన్వాడీ సెంటర్‌లో అంగన్వాడీ ఉత్సవాన్ని నిర్వహించారు. బీజేపీ అర్బన్-2 పట్టణ అధ్యక్షుడు పాలెం రెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి అర్బన్-2 రూరల్ అధ్యక్షుడు గోపిరెడ్డి మురళీకృష్ణ రెడ్డి, జిల్లా కార్యదర్శులు జయలక్ష్మి, చిరంజీవి రెడ్డి తదితర నాయకులు హాజరయ్యారు.
కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, గర్భిణీలు, చిన్నారులతో బీజేపీ నాయకులు సమావేశమయ్యారు. అంగన్వాడీ కేంద్రంలో అమలవుతున్న కార్యక్రమాలు, కేంద్రం నిర్వహణ విధానం, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణ చర్యలు వంటి అంశాలపై కార్యకర్తలతో నాయకులు వివరాలు తెలుసుకున్నారు.
అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు అందిస్తున్న సేవలను బీజేపీ నాయకులు అభినందించారు. వారి సేవా భావాన్ని గుర్తిస్తూ వారిని సత్కరించి కానుకలు అందజేశారు. గ్రామీణ, పట్టణ పేద కుటుంబాల చిన్నారుల ఆరోగ్య, విద్యాభివృద్ధిలో అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.
చిన్నారులకు పౌష్టికాహారంలో ఎటువంటి లోటు లేకుండా, వారు ఆరోగ్యంగా ఎదిగి భవిష్యత్తులో మంచి పౌరులుగా తీర్చిదిద్దేలా అంగన్వాడీ కేంద్రాలు పనిచేస్తున్నాయని బీజేపీ నాయకులు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నాయని, నిధుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాయని వారు చెప్పారు.
అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి ఎటువంటి సమస్యలు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలని నాయకులు కార్యకర్తలను కోరారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న తల్లులు, గర్భిణీ మహిళలు, అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, బీజేపీ నాయకులు కలిసి గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు వెంకట్ రాముడు, జిల్లా కార్యవర్గ సభ్యుడు రవిశంకర్, అంగన్వాడీ సూపర్వైజర్ లక్ష్మమ్మ, అంగన్వాడీ కార్యకర్తలు శశికళ, రామతులసి, మహేశ్వరి, మహిళా మోర్చా నాయకురాలు అఖిల కుమారి, యువమోర్చా నాయకుడు చరణ్ తదితరులు పాల్గొన్నారు.













