రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించనున్నారు. గురువారం ఈ శిబిరానికి సంబంధించిన పోస్టర్లను డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమం ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రక్త నిధి కేంద్రంలో ఈ నెల 28వ తేదీ సోమవారం ఉదయం జరగనుంది.
పోస్టర్ విడుదల అనంతరం విలేకరులతో మాట్లాడిన డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి, స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్ దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుడని పేర్కొన్నారు. ఆయన జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం ద్వారా యువతలో సేవాభావం పెంపొందుతుందని అభిప్రాయపడ్డారు.
భగత్ సింగ్ జయంతి సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి రక్త నిధి కేంద్రం నందు 28వ తేదీ సోమవారం ఉదయం మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాము. ప్రొద్దుటూరు పట్టణంలో యువత ముందుకు వచ్చి భగత్ సింగ్ జయంతి మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కోరుతున్నాము.
ఇటీవలి కాలంలో గర్భిణీ స్త్రీలకు రక్తం చాలా తక్కువగా ఉండడం వల్ల రక్త కొరత సమస్య తీవ్రంగా కనిపిస్తున్నదని ఆయన వివరించారు. ఈ పరిస్థితుల్లో రక్తదాన శిబిరాల ప్రాముఖ్యత మరింత పెరిగిందని అన్నారు.
ఈ మధ్యకాలంలో చాలామందికి, ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు రక్తం చాలా తక్కువ ఉండడం వలన రక్త కొరత ఏర్పడింది. కాబట్టి విద్యార్థులు, ప్రజలు, ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరు రక్తం ఇవ్వచ్చు.
భగత్ సింగ్ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ రక్తదాన శిబిరానికి యువత, విద్యార్థులు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో స్పందించాలని ఆయన పిలుపునిచ్చారు. రక్తదానం ద్వారా అనేక మంది ప్రాణాలు రక్షించబడతాయని, ఇది సమాజానికి చేయగలిగే గొప్ప సేవలలో ఒకటని ఆయన పేర్కొన్నారు.
భగత్ సింగ్ రక్తదాన శిబిరం పోస్టర్ విడుదల కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం ప్రొద్దుటూరు మండల అధ్యక్షులు పాలజీ శేఖర్, కార్యదర్శి గుర్రం డేవిడ్ రాజ్, సుమన్, జాషువా, శేఖర్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.













