రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో భవన నిర్మాణ అనుమతులు, పర్యవేక్షణ, తనిఖీలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీ ప్రక్రియను ప్రభుత్వం మరింత సులభతరం చేయనున్నట్లు పురపాలక సంఘం కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. భవనాలకు సంబంధించిన ఫైళ్లను ఇకపై మూడు స్థాయిల్లోనే పరిశీలించి నిర్ణయించేలా ఏకరీతి విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం భవన విస్తీర్ణాన్ని బట్టి టౌన్ ప్లానింగ్ విభాగంలో వివిధ స్థాయిల్లో ఫైళ్లు తిరుగుతున్నాయని, ఒక్కో విభాగంలో ఒక్కో విధమైన పద్ధతి అమలవడం వల్ల తనిఖీలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ల జారీలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వం గుర్తించినట్లు కమీషనర్ వివరించారు. దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అన్ని పట్టణ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో లెవల్-1, లెవల్-2, లెవల్-3గా పర్యవేక్షణ వ్యవస్థను ఏకరీతిగా రూపొందించినట్లు చెప్పారు.
కొత్త విధానంలో లెవల్-3 అధికారినే నిర్ణయ అధికారిగా కొనసాగిస్తారని, ఆయా భవన విస్తీర్ణాల ఇన్స్పెక్టర్ సెక్షన్‌కు ఉన్న నిర్ణారణ అధికారి అధికారాల్లో ఎలాంటి మార్పు ఉండదని కమీషనర్ తెలిపారు. నూతన ప్రక్రియతో వెసులుబాటు పెరిగినా నియంత్రణ, పర్యవేక్షణలో రాజీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసినట్లు ఆయన పేర్కొన్నారు. నిర్దేశిత కేడర్ పోస్టు అందుబాటులో లేని చోట తదుపరి ఉన్నతస్థాయి అధికారి ఆ బాధ్యతలను నిర్వర్తిస్తారని చెప్పారు.
భవన విస్తీర్ణానికి అనుగుణంగా అధికారులకు ప్రభుత్వం కీలక బాధ్యతలను అప్పగించింది. 100 చదరపు మీటర్ల వరకు ఉన్న భవనాలకు లెవల్-1లో వార్డ్ ప్లానింగ్ అండ్ రేగులటరీ సెక్రటరీ , లెవల్-2లో టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ వర్సెర్ / టౌన్ ప్లానింగ్ సూపెర్వైసోర్ , లెవల్-3లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. 100 నుంచి 200 చదరపు మీటర్ల పైగా ఉన్న భవనాలకు లెవల్-1లో వార్డ్ ప్లానింగ్ అండ్ రేగులటరీ సెక్రటరీ , లెవల్-2లో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ , లెవల్-3లో అసిస్టెంట్ సిటీ ప్లానర్ / అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్ వ్యవహరిస్తారు.
200 నుంచి 300 చదరపు మీటర్ల పైగా ఉన్న భవనాలకు లెవల్-1లో వార్డ్ ప్లానింగ్ అండ్ రేగులటరీ సెక్రటరీ , లెవల్-2లో అసిస్టెంట్ సిటీ ప్లానర్ , లెవల్-3లో డిప్యూటీ సిటీ ప్లానర్ / డిప్యూటీ ప్లానింగ్ ఆఫీసర్ బాధ్యతలు ఉంటాయి. 300 నుంచి 500 చదరపు మీటర్ల పైగా ఉన్న భవనాలకు లెవల్-1లో వార్డ్ ప్లానింగ్ అండ్ రేగులటరీ సెక్రటరీ , లెవల్-2లో డిప్యూటీ సిటీ ప్లానర్ , లెవల్-3లో సిటీ ప్లానర్ / ప్లానింగ్ ఆఫీసర్ వ్యవహరిస్తారు.
500 నుంచి 4,000 చదరపు మీటర్ల వరకు ఉన్న భవనాలకు ( హై Rise భవనాలు మినహా) లెవల్-1లో వార్డ్ ప్లానింగ్ అండ్ రేగులటరీ సెక్రటరీ , లెవల్-2లో సిటీ ప్లానర్ , లెవల్-3లో చీఫ్ సిటీ ప్లానర్ / చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ నిర్ణారణ చేస్తారు. 4,000 చదరపు మీటర్లకు పైగా ఉన్న భవనాలకు ( హై Rise భవనాలు మినహా) లెవల్-1లో వార్డ్ ప్లానింగ్ and రేగులటరీ సెక్రటరీ , లెవల్-2లో చీఫ్ సిటీ ప్లానర్ , లెవల్-3లో కమీషనర్ / వైస్ చైర్ పర్సన్ / మెట్రోపాలిటన్ కమీషనర్ నిర్ణయ అధికారిగా వ్యవహరిస్తారు.
పౌరులకు సత్వర సేవలందించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాధ్ తెలిపారు. పురపాలన మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా, పౌరులకు అనుకూలంగా మారడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. నియంత్రణపరమైన పరీక్షల్లో రాజీ పడకుండా అనవసరమైన ప్రక్రియలను తొలగించడం జరిగిందని వివరించారు.
ఈ కొత్త విధానం వేగం, బాధ్యత, పర్యవేక్షణ మధ్య సమతూకాన్ని సాధించేందుకు ఉపయోగపడుతుందని కమీషనర్ అభిప్రాయపడ్డారు. పర్యవేక్షణ, తనిఖీలు పరిపాలనా స్థాయిల సంఖ్య పెరగడం వల్ల అనవసర కాలవృథా అవకాశం ఉన్న నేపథ్యంలో మూడు స్థాయిల విధానంతో ప్రతి దశలో బాధ్యత స్పష్టంగా ఉండి ప్రజలకు సేవలు సులభమవుతాయని చెప్పారు. అదే సమయంలో నిర్దేశిత నిర్ణారణ అధికారి పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు.
భవన సంబంధిత సేవలు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు ప్రభుత్వం నిర్దేశించిన గడువులోనే ప్రజలకు అందాలని, ప్రతి దశలో ఎవరి బాధ్యత ఏమిటో స్పష్టంగా ఉండాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు కమీషనర్ పేర్కొన్నారు. పరిపాలనా ప్రక్రియలో పునరావృతం, అనవసరమైన స్థాయిలను తగ్గించడం ద్వారా వేగవంతమైన, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.













