రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా, ప్రొద్దుటూరు: జలజీవన్ మిషన్ ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 5వ తేదీన ప్రొద్దుటూరుకు రానున్న నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
గురువారం ప్రొద్దుటూరులోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో శాసన సభ్యులు శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా తదితరులతో కలిసి వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి సభా ప్రాంగణం, వేదిక, బారికేడింగ్, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య ఆరోగ్య, అగ్నిమాపక, భద్రత తదితర ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సూచించారు. ప్రతి శాఖకు కేటాయించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా భద్రతా చర్యలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల రాకపోకలు, పార్కింగ్ ప్రాంతాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.
శాసన సభ్యులు శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ప్రొద్దుటూరుకు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం అయ్యేలా అధికారులు పనిచేయాలని అన్నారు.
జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు పటిష్టంగా ఉండేలా ప్రతి శాఖకు కేటాయించిన విధులను ఆ శాఖ అధికారులు ఎక్కడా పొరపాట్లకు తావివ్వకుండా పూర్తి చేయాలని సూచించారు.
సమీక్ష సమావేశంలో AP Shakes సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ వి.ఎస్. ముక్తియార్, ప్రొద్దుటూరు ASP శ్రీ కృష్ణ, జమ్మలమడుగు, కడప, బద్వేల్, పులివెందుల RDOలు శ్రీమతి శిరీష, శ్రీ చంద్రశేఖర్, శ్రీ చిన్నయ్య, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీ జాన్ ఇర్విన్, DRDA PD రాజ్యలక్ష్మి, RWS, R&B, SPDCL SEలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
తరువాత జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, శాసన సభ్యులు శ్రీ నంద్యాల వరదరాజుల రెడ్డి, జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ డా. నిధి మీనా, జిల్లా అధికారులతో కలిసి బహిరంగ సభ ప్రదేశం, హెలిప్యాడ్ ప్రదేశాలను పరిశీలించారు. అక్కడి ఏర్పాట్లపై అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.













