కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన 31వ విడతగా 46 మంది లబ్ధిదారులకు మొత్తం రూ.35,24,537 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులు రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు.

కష్టాల్లో ఉన్న ప్రజలకు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రభుత్వం అండగా నిలుస్తోందని, ఈ నిధి పేదల కోసం పెద్ద సహాయంగా మారిందని ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి పేర్కొన్నారు. కష్టకాలంలో ప్రజలకు తోడుగా నిలుస్తున్న చీఫ్ మినిస్టర్ N. చంద్రబాబు నాయుడు కు ప్రజలందరూ మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.

కూటమి ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలు అమలు చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రొద్దుటూరు నియోజకవర్గం రెండో, మూడో స్థానాల్లో నిలుస్తోందని ఆయన వివరించారు.

ఇప్పటి వరకు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం 1,401 మందికి సుమారు రూ.12,22,95,126 విలువైన చీఫ్ మినిస్టర్ రిలీఫ్ Fund సహాయాన్ని పంపిణీ చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ నిధుల ద్వారా వైద్య చికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించగలిగామని ఆయన పేర్కొన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ బేపారి జాకిర్ అహ్మద్ , రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసాచారి , TDP కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు , మాజీ ZPTC సభ్యుడు తోట మహేశ్వర రెడ్డి , మార్కెట్ కమిటీ ఇంచార్జ్ చైర్మన్ పట్నం లక్ష్మణ్ కుమార్ , TDP పట్టణ అధ్యక్షుడు చల్ల రాజగోపాల్ యాదవ్ , TDP పట్టణ మాజీ అధ్యక్షుడు E.V. సుధాకర్ Reddy, సీతారామి రెడ్డి , నూరి , మాడెం సుధాకర్ రెడ్డి తదితర కూటమి ప్రభుత్వ నాయకులు పాల్గొన్నారు.