రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరులోని ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో ‘గోపాల్-ఇ-స్కూల్’ వారి దసరా కల్చరల్ క్యాంప్ నిర్వహించబడుతున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. రిలయన్స్ మార్ట్ దగ్గర, కొర్రపాడు రోడ్డు వద్ద ఉన్న ఇస్కాన్ మందిరం ఆధ్వర్యంలో ఈ శిక్షణా కార్యక్రమం జరగనుంది. ప్రొద్దుటూరు స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో క్యాంప్ వివరాలను నిర్వాహకులు వెల్లడించారు.
ఈ శిక్షణా కార్యక్రమం అక్టోబర్ 10, 2026 నుండి అక్టోబర్ 21 వరకు ప్రతిరోజూ ఉదయం 9:45 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంట వరకు నిర్వహించనున్నారు. 1 నుండి 5వ తరగతి వరకు ఒక విభాగం, 6 నుండి 10వ తరగతి వరకు మరో విభాగంగా రెండు విడతలుగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నారు.
శిబిరంలో పాల్గొనే విద్యార్థులకు మంత్ర ధ్యానం, భగవద్గీత శ్లోకాలు, నీతి కథలు, వివిధ యాక్టివిటీస్, ఆటలు, నృత్యం వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఆధ్యాత్మికతతో పాటు పిల్లల్లో సృజనాత్మకత, విలువల పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
శిక్షణలో పాల్గొనే ప్రతి విద్యార్థికి ఒక ఆధ్యాత్మిక కానుకతో పాటు కోర్సు కంప్లీషన్ సర్టిఫికేట్ అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. క్యాంప్ ప్రవేశ రుసుము రూ. 500/-గా నిర్ణయించారు.
క్యాంప్ ముగింపు సందర్భంగా అక్టోబర్ 20, 2026న పరీక్ష నిర్వహించనున్నారు. భగవద్గీత శ్లోకాలు విభాగానికి 25 మార్కులు, బహుళైచ్ఛిక ప్రశ్నలు (MCQ) విభాగానికి 25 మార్కులు కేటాయించి, మొత్తం 50 మార్కులకు పరీక్ష జరపనున్నారు. రెండు విభాగాలలోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి బహుమతులు అందజేస్తారు.
విజేతలకు ప్రథమ బహుమతిగా రూ. 6,000/-, ద్వితీయ బహుమతిగా రూ. 3,000/-, తృతీయ బహుమతిగా రూ. 1,000/- నగదు బహుమతులు ఇవ్వనున్నారు. అదనంగా 10 మంది విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు కూడా అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
విజేతలకు బహుమతుల ప్రదానం అక్టోబర్ 25వ తేదీ ఆదివారం జరుగుతుంది. ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ల కోసం 8520027510, 6303474393 లేదా 9912266036 నంబర్లను సంప్రదించవచ్చు.













