ప్రొద్దుటూరు జనసేన పార్టీ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పార్టీ క్యాడర్‌తో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికలకు ముందుగానే సిద్ధం కావాలని, ప్రతి కార్యకర్త తనకు సంబంధించిన ఓటర్ల జాబితాను సక్రమంగా పరిశీలించుకోవాలని నాయకులకు సూచనలు చేశారు.

పార్టీలో ఉన్న జనసైనికులు, నాయకులు అందరూ ఐకమత్యంగా ఉండి ప్రజలతో మరింత మమేకం కావాలని సమావేశంలో స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం లో పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలు, ఆయన అందించే సంక్షేమ పథకాలు, జనసేన తరఫున అమలు చేయబోయే అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు చేరవేయాల్సిన అవసరాన్ని నాయకులు వివరించారు.

వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసే అభ్యర్థులను పూర్తి స్థాయిలో గెలిపించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని, లక్ష్యంగా పెట్టుకున్న స్థానాల్లో 100% విజయాన్ని సాధించేందుకు కృషి చేయాలని ఎలక్షన్ సమన్వయ కమిటీ సభ్యుడు A రామారావు నాయకులకు సూచించారు.

ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న అభ్యర్థులు రామాజీ ప్రసాద్, మంచాల సంజీవ్, మాదాసు మురళి, సుంకర మురళీ, Poc కల్యాణ్ రెడ్డి, సేగిరెడ్డి పవన్ కుమార్ రెడ్డి, మంచి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. అభ్యర్థులు తమ తమ ప్రాంతాల్లో పార్టీ బలపర్చే విధానంపై, ప్రజల సమస్యల పరిష్కారంపై, ఎన్నికల వ్యూహంపై నాయకులతో చర్చించారు.

క్యాడర్ స్థాయిలో బూత్ వారీగా సమన్వయం పెంచి, ఓటర్లను ప్రత్యక్షంగా సంప్రదించి, పార్టీ విధానాలు, సంకల్పాలను వారికి వివరించాలని సమావేశంలో నిర్ణయించారు. స్థానిక స్థాయిలో జనసేనకు ఉన్న మద్దతును ఓట్లుగా మలచేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేయాలని నాయకులు సూచించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.