ప్రొద్దుటూరు కొత్తపల్లి బైపాస్ రోడ్డులోని D-Mart సమీపంలో ఏర్పాటు చేసిన కనకదుర్గ ట్రేడ్ ఫెయిర్ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభం కానుందని నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని విధంగా విస్తృత స్థాయిలో ఈ ఎగ్జిబిషన్‌ను సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

ఎగ్జిబిషన్‌లో వివిధ రకాల అద్భుతమైన వస్తువులను ప్రదర్శన, విక్రయాల కోసం ఉంచుతున్నట్లు నిర్వాహకులు చెప్పారు. రెస్టారెంట్ ఫుడ్ స్టాల్స్, షాపింగ్ రూమ్స్‌తో పాటు పిల్లల కోసం ప్రత్యేకంగా 10–15 రకాల వినోద, వినియోగ వస్తువులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. కుటుంబ సభ్యులందరూ కలిసి వచ్చి ఒకేచోట వినోదం, షాపింగ్, భోజనం వంటి అనుభవాలను పొందేలా ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు.

ప్రారంభోత్సవ కార్యక్రమం గురువారం సాయంత్రం జరగనుంది. ఆ రోజు ఎగ్జిబిషన్‌ను సందర్శించే ప్రజలందరికీ ఎలాంటి ఎంట్రీ టికెట్ వసూలు చేయబోరని నిర్వాహకులు స్పష్టం చేశారు. అలాగే పార్కింగ్ సౌకర్యం కూడా పూర్తిగా ఉచితంగా కల్పించనున్నట్టు తెలిపారు. బైక్, ఆటో, కార్లతో వచ్చే వారికి కూడా పార్కింగ్ ఫీజు ఉండదని వెల్లడించారు.

పేద, మధ్యతరగతి కుటుంబాలు, పిల్లలు ఎలాంటి సంకోచం లేకుండా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఎగ్జిబిషన్‌ను సందర్శించాలని నిర్వాహకుల్లో ఒకరైన ప్రవీణ్ కుమార్ రెడ్డి కోరారు. అందరికీ అందుబాటులో ఉండే ధరలకు వస్తువులు, ఆహార పదార్థాలు, పిల్లల వినోదానికి సంబంధించిన అంశాలు ఉండేలా చూసినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రొద్దుటూరు ప్రజలకు వినోదంతో పాటు కుటుంబ సమేతంగా విశ్రాంతి గడిపే అవకాశాన్ని కల్పించే ఉద్దేశంతో ఈ ఎగ్జిబిషన్‌ను నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకుల సౌకర్యం కోసం పార్కింగ్, భద్రత, తాగునీరు, విశ్రాంతి స్థలాలు వంటి ఏర్పాట్లు చేసినట్లు పేర్కొన్నారు.