రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు శివాలయం శ్రీ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక TTD కళ్యాణమండపంలో 50వ వార్షికోత్సవం సందర్భంగా గణపతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి MLA నంద్యాల వరదరాజులరెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
తరువాత ఆయన గణపతి ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి 50వ వార్షికోత్సవ స్వర్ణోత్సవ సావనీరు పుస్తకాన్ని ఆవిష్కరించారు. స్వర్ణోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
శివాలయం శ్రీ గణపతి ఉత్సవ కమిటీ గత 50 ఏళ్లుగా ప్రొద్దుటూరులో గణపతి ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు స్వర్ణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు, కార్యక్రమాల వివరాలను పాల్గొన్న అతిథులకు వివరించారు.
కార్యక్రమంలో శివాలయం ఛైర్మన్ వంగల నారాయణారెడ్డి, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు మల్లిఖార్జున రావు, వీరారెడ్డి, సుధీర్ నాయుడు, అట్ల నరసింహారెడ్డి, కొప్పర్తి శేఖర్, పుల్లయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.













