రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: వైయస్ కడప జిల్లా ప్రొద్దుటూరులో సేవా సంకల్ప అభియాన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ పోషణ్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 సంవత్సరాల ప్రజా జీవితం, పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న 'సేవా సంకల్ప అభియాన్'లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
సేవా సంకల్ప అభియాన్ ప్రొద్దుటూరు కన్వీనర్ బి. రెడ్డి ప్రసన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవా సంకల్ప అభియాన్ కడప జిల్లా అధ్యక్షురాలు చేవూరు శారదమ్మ, ప్రొద్దుటూరు ఇంచార్జ్ వెంకట్, కో-కన్వీనర్ చెన్నై మోహన్ పాల్గొన్నారు. వీరు స్థానిక అంగన్వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడి పరిస్థితులను సమీక్షించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు అందుతున్న పోషకాహారం, మౌలిక వసతుల స్థితిగతులు, సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలపై నాయకులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్రాల వారీగా సిబ్బందితో మాట్లాడి ప్రస్తుతం అమలులో ఉన్న సేవలు, అవసరమైన సదుపాయాలపై సమాచారం సేకరించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలను త్వరలోనే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు స్పష్టం చేశారు. సేవా సంకల్ప అభియాన్ ద్వారా ప్రజలకు మరింత చేరువగా ఉంటూ సేవా కార్యక్రమాలను విస్తృతం చేయడమే తమ లక్ష్యమని వారు పేర్కొన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి ప్రదీప్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యురాలు ఎం. కుమారి, జిల్లా కార్యదర్శి చిరంజీవి రెడ్డి, బీజేపీ ప్రొద్దుటూరు నగరం-1 పట్టణ అధ్యక్షులు వంకధార నరేంద్రరావు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు తుపాకుల చౌడయ్య, మహిళా మోర్చా అధ్యక్షురాలు అఖిల, ప్రధాన కార్యదర్శి శ్రీశ్రీ తదితరులు పాల్గొన్నారు.
అభియాన్ భాగంగా ప్రొద్దుటూరులో చేపట్టిన ఈ అంగన్వాడీ పోషణ్ అభియాన్ కార్యక్రమం ద్వారా స్థానిక కేంద్రాల పనితీరును సమీక్షించి, అవసరమైన మార్పులు, మెరుగుదలల కోసం చర్యలు తీసుకునే దిశగా నాయకులు ముందడుగు వేసినట్లు కార్యక్రమంలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు.













