ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నియోజకవర్గానికి సంబంధించిన 30వ విడత ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మొత్తం 53 మంది లబ్ధిదారులకు 52.62 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి పంపిణీ కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా రెండో, మూడో స్థానాల్లో నిలుస్తోందని కార్యక్రమంలో పేర్కొన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు మొత్తం 1355 మందికి సుమారు 11,87,70,589 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి మెరుగైన వైద్య సదుపాయాలు అందించేందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి వివరించారు. వైద్య ఆరోగ్య రంగాలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి పేదలకు అండగా నిలుస్తోందని ఆయన చెప్పారు.

పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ఎలాంటి చికిత్స తీసుకున్నా అందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించి కుటుంబాలకు భరోసాగా ఉంటోందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు అండగా నిలుస్తూ అవసరమైన ఆర్థిక భరోసా కల్పించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ సంక్షేమ డైరెక్టర్ శ్రీనివాసాచారి, TDP కడప పార్లమెంట్ అధికార ప్రతినిధి ఘంటసాల వెంకటేశ్వర్లు, TDP పట్టణ అధ్యక్షుడు చల్లా రాజగోపాల్ యాదవ్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ వెంకటకొండయ్య తదితరులు పాల్గొన్నారు.