రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్:
ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్లో గెజిట్ ధరలే అమలు చేయాలి: వినతిపత్రం సమర్పించిన గండ్లూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి
ప్రొద్దుటూరు మున్సిపల్ ఎగ్జిబిషన్లో అధికారులు నిర్దేశించిన మున్సిపల్ గెజిట్ ప్రకారమే ధరలను అమలు చేయాలని కోరుతూ మాజీ TDP నియోజకవర్గ ఇన్చార్జ్ గండ్లూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ తోదిక శ్రీనివాస విశ్వనాథ్‌కు వినతిపత్రం సమర్పించారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, TDP నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎగ్జిబిషన్లో గెజిట్‌లో పేర్కొన్న ధరలకు మించి వసూలు చేసే పరిస్థితులు ఉండకూడదని, ప్రజలపై అదనపు భారం పడకుండా చూడాలని ప్రవీణ్ కుమార్ రెడ్డి కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఎగ్జిబిషన్ నిర్వహణలో పారదర్శకత ఉండాలని, ధరల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు.

ఈ సందర్భంగా గండ్లూరి ప్రవీణ్ కుమార్ రెడ్డి ఎగ్జిబిషన్లో అదనపు ధరలు వసూలు చేసి ప్రజలను దోపిడీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను అభ్యర్థించారు. గతంలోనూ ప్రజల హక్కుల కోసం తాను పోరాడిన విషయాన్ని గుర్తుచేశారు. గెజిట్‌లో పొందుపరిచిన ధరలనే ఎగ్జిబిషన్లో అమలు చేయాలని, ప్రజలకు అన్యాయం జరిగితే సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఎగ్జిబిషన్ వద్ద పర్యవేక్షణ కోసం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, అధికారులను నియమించాలని కమిషనర్‌ను డిమాండ్ చేశారు. అలాగే, ప్రొద్దుటూరు ఎమ్మెల్యేకు, మున్సిపాలిటీకి చెడ్డపేరు రాకుండా చూడాలని కోరారు.
వినతిపత్రం స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ తోదిక శ్రీనివాస విశ్వనాథ్ సానుకూలంగా స్పందించినట్లు పాల్గొన్న నాయకులు తెలిపారు. గెజిట్ నిబంధనల ప్రకారమే ధరలు ఉండేలా కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.
గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారికి గానీ, మున్సిపాలిటీకి గానీ ఎలాంటి చెడ్డపేరు రాకుండా చూసుకుంటాను. మీ మాటను తూచా తప్పకుండా పాటిస్తాం. ఎగ్జిబిషన్ పర్యవేక్షణకు ముందే ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించాం
అని కమిషనర్ తోదిక శ్రీనివాస విశ్వనాథ్ గండ్లూరి ప్రవీణ్ కుమార్ రెడ్డికి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్‌తో పాటు మున్సిపల్ M.E, మున్సిపల్ సిబ్బంది, TDP నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిషన్లో ధరల నియంత్రణపై కమిషనర్ హామీతో ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.













