రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ జూదం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామేశ్వరం రోడ్‌లోని ఆనా బంక్ వద్ద ఈశ్వర్ రెడ్డి నగర్‌కు చెందిన నక్క శ్రీకాంత్, నాగేపల్లి రాజేశ్‌లు old 777.com యాప్ ద్వారా ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ సమాచారం ఆధారంగా ప్రొద్దుటూరు వన్ టౌన్ ఎస్.ఐ మైనుదిన్ ఆధ్వర్యంలో పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో నక్క శ్రీకాంత్, నాగేపల్లి రాజేశ్‌లను పట్టుకుని, వారి వద్ద నుండి రూ.9,000 నగదు, ఒక సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఆన్‌లైన్ ద్వారా క్రికెట్ మ్యాచ్‌లపై బెట్టింగ్‌లు స్వీకరిస్తూ జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో బయటపడింది.
ప్రొద్దుటూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ T.V కొండారెడ్డి తెలిపారు ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, మట్కా వంటి అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు కొనసాగిస్తున్నామని, ఇలాంటి జూదాలకు పాల్పడే వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
పోలీసులు ప్రజలకు హెచ్చరికలతో పాటు సూచనలు కూడా జారీ చేశారు. ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్, మట్కా వంటి జూదాలకు దూరంగా ఉండాలని, ఇవి వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబాలను, సమాజాన్ని దెబ్బతీసే ప్రమాదకరమైన అలవాటులని పోలీసులు పేర్కొన్నారు.
తమ ప్రాంతాల్లో ఎవరైనా క్రికెట్ బెట్టింగ్, మట్కా లేదా ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తెలిసిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాజంలో శాంతి భద్రతలు, చట్ట సువ్యవస్థ కోసం ప్రజలు, పోలీసులు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.
ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ జూద కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో, పోలీసులు గూఢచారి వ్యవస్థను బలోపేతం చేసి, ప్రత్యేక దళాలను ఏర్పాటు చేసి పర్యవేక్షణను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్లపై నిఘా పెట్టి, ఇలాంటి అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు చర్యలు కొనసాగిస్తున్నారు.













