రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ప్రొద్దుటూరు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీకి చెందిన 80 కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో స్థానిక రాజకీయ సమీకరణాల్లో మార్పు సంభవించింది. వైఎస్ఆర్సీపీ ప్రాథమిక సిద్ధాంతాలు, పార్టీ ప్రగతి విధానాలకు ఆకర్షితులై ఈ కుటుంబాలు ఇవాళ వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నాయి.
ప్రొద్దుటూరు మాజీ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమం అత్యంత వైభవంగా సాగింది. యువ నాయకత్వం, స్థానిక నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ప్రొద్దుటూరు 24వ వార్డు ఇంచార్జ్ వెంకటరమణారెడ్డి, యువ నాయకుడు కొత్తపల్లె రాజేష్ ఆధ్వర్యంలో టిడిపికి చెందిన 80 కుటుంబాల ప్రతినిధులు, పెద్ద సంఖ్యలో యువకులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ వైఎస్సార్సీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ భారీ చేరికల కార్యక్రమంలో ప్రొద్దుటూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ శ్రేణులు విశేషంగా పాల్గొన్నారు. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెంట పాల్గొన్న నాయకుల్లో మాజీ కౌన్సిలర్ భూమిరెడ్డి వంశీధర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ పాతకోట బంగారు రెడ్డి, మాజీ కౌన్సిలర్ పాతకోట వంశీధర్ రెడ్డి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్సీపీ ప్రొద్దుటూరు యువజన విభాగం గురునాథ్ రెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ సెల్ స్టేట్ కార్యదర్శి గోటూరు వెంకటేష్ తదితరులు ఉన్నారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పార్టీ అభివృద్ధి, ప్రజల సంక్షేమం పట్ల వైఎస్సార్సీపీ నిబద్ధతను వివరించారు. పార్టీ సిద్ధాంతాలను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం, గౌరవం కల్పించబడుతుందని ఆయన హామీ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే స్థానిక నేతలు వెంకటరమణారెడ్డి, కొత్తపల్లె రాజేష్ కృషిని ప్రత్యేకంగా అభినందించారు.
భారీ సంఖ్యలో టిడిపి కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరడంతో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ కేడర్లో నూతన ఉత్సాహం నెలకొన్నట్లు పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఈ చేరికలతో స్థానికంగా వైఎస్సార్సీపీ బలపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.













