బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#దొంగతనాల

8 articles

పాత బీగాలతో బైక్‌లు చోరీ చేసిన Swiggy డెలివరీ బాయ్ అరెస్ట్
జిల్లా వార్తలు

పాత బీగాలతో బైక్‌లు చోరీ చేసిన Swiggy డెలివరీ బాయ్ అరెస్ట్

వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలు చేస్తున్న Swiggy డెలివరీ బాయ్ సూర్య గురు తేజను పోలీసులు అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.3.50 లక్షల విలువైన ఏడు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పాత బీగాలు, మాస్టర్ కీతో బైక్‌ల లాక్‌లు తెరిచి చోరీ చేసినట్లు విచారణలో ఒప్పుకున్న అతనిపై కేసు నమోదు చేయగా, పెరుగుతున్న బైక్ దొంగతనాల నేపథ్యంలో వాహనదారులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

4, ఆగ 2026

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన
జాతీయం

పార్లమెంట్‌లో కాంగ్రెస్‌ వినూత్న నిరసన

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అయోధ్య రామమందిర కానుకల దొంగతనాలపై పార్లమెంటు ఎదుట  శుక్రవారం కాంగ్రెస్‌ వినూత్న రీతిలో నిరసన తెలిపింది.

31, జులై 2026

నీళ్ల మోటార్లు దొంగతనం ముఠా అరెస్టు
ఆంధ్రప్రదేశ్

నీళ్ల మోటార్లు దొంగతనం ముఠా అరెస్టు

గుంటూరు జిల్లా పొలాల్లో వరుసగా జరుగుతున్న నీళ్ల మోటార్లు దొంగతనాల కేసులో పొన్నూరు పోలీసులు ఏడుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేసి, 85 మోటార్లు, కాపర్ వైర్లు, ఒక కారు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. తాడికొండ, పొన్నూరు, పెదపలకలూరు ప్రాంతాలకు చెందిన ఈ గ్యాంగ్ పొన్నూరు, చేబ్రోలు, చుండూరు, తెనాలి పరిసరాల్లో దొంగతనాలు చేసినట్లు అనుమానం ఉండగా, కేసు దర్యాప్తు కొనసాగుతోంది.

29, జులై 2026

తిరుమలలో అంతర్రాష్ట్ర జేబుదొంగలు, చిటర్స్ ముఠా అరెస్ట్
జిల్లా వార్తలు

తిరుమలలో అంతర్రాష్ట్ర జేబుదొంగలు, చిటర్స్ ముఠా అరెస్ట్

తిరుమలలో భక్తులను లక్ష్యంగా చేసుకుని జేబుదొంగతనాలు, మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను తిరుమల టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ TTD గుర్తింపు కార్డుతో VIP దర్శనం, వసతి కల్పిస్తానని చెప్పి PhonePe ద్వారా డబ్బులు వసూలు చేస్తున్న మహిళ సహా ముగ్గురు వద్ద నుంచి నగదు, నకిలీ ఐడీ, సెల్‌ఫోన్లు, పరికరాలు స్వాధీనం చేసి కేసు నమోదు చేశారు.

28, జులై 2026

మైదుకూరులో ఆగని ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు: రైతు సేవా సమితి ఆగ్రహం
జిల్లా వార్తలు

మైదుకూరులో ఆగని ట్రాన్స్‌ఫార్మర్ల దొంగతనాలు: రైతు సేవా సమితి ఆగ్రహం

కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో ట్రాన్స్‌ఫార్మర్లు, స్టార్టర్లు, మోటార్లలోని రాగి వైర్ల దొంగతనాలు పెరుగుతున్నాయని రైతు సేవా సమితి నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మైదుకూరు సమీపంలోని రైతు పందిటి రంగయ్య పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనాన్ని పరిశీలించిన సమితి జిల్లా అధ్యక్షుడు ఏవీ. రమణ, ప్రభుత్వం, పోలీసుల వైఫల్యాన్ని తీవ్రంగా విమర్శిస్తూ, రాత్రి గస్తీ బలపరచడం, పర్యవేక్షణ పెంచడం, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

13, జులై 2026

అనంతపురంలో బైక్ దొంగల ముఠా అరెస్ట్‌ – 25 బైకులు స్వాధీనం
జిల్లా వార్తలు

అనంతపురంలో బైక్ దొంగల ముఠా అరెస్ట్‌ – 25 బైకులు స్వాధీనం

అనంతపురం టూ టౌన్ పోలీసులు భారీ బైక్ దొంగల ముఠాను అరెస్ట్ చేసి, సుమారు రూ.19 లక్షల విలువైన 25 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. బండారు మురళీకృష్ణ, పొన్నూరు షేక్ ఆలీ అక్బర్ అనే ఇద్దరు నిందితులు అనంతపురం జిల్లా సహా తెలంగాణలో కూడా బైకులు దొంగిలించినట్లు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు. వరుస దొంగతనాల నేపథ్యంలో ఈ అరెస్ట్‌లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

13, జులై 2026

సినిమా పిచ్చితో షాపింగ్ మాల్స్ లూటీ.. 32 చోరీల నిందితుడు అనంతపురంలో అరెస్ట్
ఆంధ్రప్రదేశ్

సినిమా పిచ్చితో షాపింగ్ మాల్స్ లూటీ.. 32 చోరీల నిందితుడు అనంతపురంలో అరెస్ట్

బెంగళూరు వ్యక్తి ఆనంద్ సినిమాపై మోజుతో గతంలో చేసిన దొంగతనాల డబ్బు, తల్లి ఇంటిని అమ్మి సుమారు రూ.2.5 కోట్లు పెట్టి ‘రిటర్న్ బై ఆనంద్.. పేజీ నంబరు 13’ హారర్ సినిమా ప్రారంభించాడు. నిధుల కొరత, అప్పులు పెరగడంతో మళ్లీ దొంగతనాలకు పాల్పడి మూడు రాష్ట్రాల్లో 32కి పైగా షాపింగ్ మాల్స్‌లో చోరీలు చేశాడు. అనంతపురం ‘డ్రెస్ సర్కిల్’ మాల్ దొంగతన కేసును విచారించిన పోలీసులు సీసీటీవీ ఆధారాలతో ఆనంద్‌ను అరెస్ట్ చేసి, నగదు, కారు, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.

12, జులై 2026

ఆర్టీసీ బస్సుల్లో బంగారం దొంగతనాలు : ముగ్గురు మహిళల అరెస్ట్
జిల్లా వార్తలు

ఆర్టీసీ బస్సుల్లో బంగారం దొంగతనాలు : ముగ్గురు మహిళల అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీ శక్తి పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో పెరిగిన రద్దీని ఆసరాగా చేసుకుని మహిళల బంగారు ఆభరణాలు దొంగిలిస్తున్న చిత్తూరు జిల్లా మహిళల గ్యాంగ్‌ను పాకాల పోలీసులు అరెస్టు చేశారు. జి.దివ్య, బి.రాధిక, బి.మేరి అనే ముగ్గురి వద్ద నుంచి 3.5 లక్షల విలువైన 32 గ్రాముల డైమండ్ గోల్డ్ నెక్లెస్ స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించి, రద్దీ బస్సుల్లో ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

10, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters