బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#హెచ్చరించింది

11 articles

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులపాటు కోస్తాకు వర్షాల హెచ్చరిక
వాతావరణం

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. మూడు రోజులపాటు కోస్తాకు వర్షాల హెచ్చరిక

వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రానున్న రెండు రోజుల్లో బలపడే అవకాశం ఉండగా, దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ కోస్తా జిల్లాల్లో వచ్చే మూడు రోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తీర ప్రాంతాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉండటంతో రహదారి రవాణా అంతరాయం, తక్కువ ఎత్తున్న ప్రాంతాల్లో నీరు నిలిచే పరిస్థితులు ఏర్పడవచ్చని అధికారులు హెచ్చరిస్తూ, ప్రజలు, మత్స్యకారులు తాజా వాతావరణ బులెటిన్లు, సూచనలను గమనించి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

16, జులై 2026

ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్‌ – యూపీ, ఉత్తరాఖండ్, కేరళకు ఆరెంజ్ హెచ్చరిక
వాతావరణం

ఢిల్లీ, హర్యానాకు రెడ్ అలర్ట్‌ – యూపీ, ఉత్తరాఖండ్, కేరళకు ఆరెంజ్ హెచ్చరిక

భారత వాతావరణ శాఖ ఢిల్లీ, హర్యానాలకు రెడ్ అలర్ట్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసి, భారీ నుంచి అతి భారీ వర్షాలు, గంటకు 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీ, ఘజియాబాద్‌లో వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలు జలమయమై, ట్రాఫిక్ తీవ్రంగా దెబ్బతినడంతో పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.

9, జులై 2026

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు వర్షాలు
వాతావరణం

తెలుగు రాష్ట్రాల్లో ఐదు రోజులపాటు వర్షాలు

నైరుతి రుతుపవనాలు, అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఐదు రోజులు, తెలంగాణలో వచ్చే మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మాన్సూన్ ఉత్తర దిశగా మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కేంద్రం పేర్కొంది.

8, జులై 2026

కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్..!
రాజకీయాలు

కవితకు కేంద్ర ఎన్నికల కమిషన్ ఝలక్..!

కల్వకుంట్ల కవితకు కేంద్ర ఎన్నికల సంఘం (EC) ఝలక్ ఇచ్చింది. ఇటీవల ఆమె స్థాపించిన ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పార్టీ పేరును కొనసాగించడానికి అనుమతి లేదని స్పష్టం చేసింది.

4, జులై 2026

ఇరాన్‌పై మళ్లీ అమెరికా వైమానిక దాడులు
అంతర్జాతీయం

ఇరాన్‌పై మళ్లీ అమెరికా వైమానిక దాడులు

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్‌ సైనిక కేంద్రాలపై అమెరికా సెంట్రల్ కమాండ్ ఆదివారం వైమానిక దాడులు జరిపింది. ప్రతిగా IRGC దళాలు కువైట్, బహ్రెయిన్‌లలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణులతో దాడులు చేయగా, హర్మూజ్‌ జలసంధి వివాదం, లెబనాన్‌లో హెజ్‌బొల్లా-ఇజ్రాయెల్‌ ఘర్షణలతో మొత్తం ప్రాంతం అస్థిరత దిశగా సాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.

29, జూన్ 2026

ఏపీలో పిడుగుల హెచ్చరిక..  : ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!
వ్యవసాయం

ఏపీలో పిడుగుల హెచ్చరిక.. : ఆ జిల్లాలకు 'ఆరెంజ్ అలర్ట్'!

ఏపీలోని పలు జిల్లాల్లో రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

22, జూన్ 2026

ఏపీకి వాతావరణ శాఖ బిగ్‌ అలర్ట్‌
వాతావరణం

ఏపీకి వాతావరణ శాఖ బిగ్‌ అలర్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మరికొన్ని గంటలు అత్యంత కీలకమని హెచ్చరించింది. పిడుగులతో కూడిన భారీ వర్షాలు, ఈదురు గాలులు వీసే అవకాశం ఉండటంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

17, జూన్ 2026

దగ్గు సిరప్‌ల విక్రయానికి బ్రేక్‌.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి
ఆరోగ్యం

దగ్గు సిరప్‌ల విక్రయానికి బ్రేక్‌.. ఇకపై డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ తప్పనిసరి

కేంద్రం జూన్ 9న జారీ చేసిన నోటిఫికేషన్‌తో డ్రగ్ రూల్స్‌లోని షెడ్యూల్ కె నుంచి సిరప్‌లను తొలగించి, దగ్గు సిరప్‌లు సహా ద్రవ ఔషధాల విక్రయానికి డాక్టర్ ప్రిస్క్రిప్షన్‌ను తప్పనిసరి చేసింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో కల్తీ దగ్గు సిరప్‌ల వల్ల చిన్నారుల మరణాలు, ఔషధాల నాణ్యతపై ఆందోళనల నేపథ్యంలో తీసుకున్న ఈ నిర్ణయం, స్వయంగా మందులు కొనుగోలు చేసే ప్రజల ప్రవర్తనలో మార్పుకు దారితీయనుంది.

16, జూన్ 2026

సాయికృష్ణ బతికే ఉన్నాడా?.. చంపేశారా? :  కేసు‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం
నేరాలు

సాయికృష్ణ బతికే ఉన్నాడా?.. చంపేశారా? : కేసు‌పై ఏపీ హైకోర్టు ఆగ్రహం

నెల రోజులుగా గల్లంతైన గాదె సాయికృష్ణ కేసులో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కృష్ణలంక సీఐ నాగరాజు వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 29లోగా సాయికృష్ణను హైకోర్టు ఎదుట హాజరుపరచాలని, లేనిపక్షంలో సీఐపై కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించింది. కుమారుడి ఆచూకీ తెలియకపోవడంతో తల్లి విజయలక్ష్మి హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ అయ్యాయి.

15, జూన్ 2026

ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..
అంతర్జాతీయం

ట్రంప్ చెప్పింది నిజం కాదు.. ఇరాన్ మండిపాటు..

ఇరాన్‌పై అమెరికా వైమానిక దాడులు చేయటంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్ నాయకులు తనకు నేరుగా ఫోన్ చేశారని ట్రంప్ తెలిపారు. ఇరాన్‌పై దాడులను ఆపాలని వారు కోరినట్లు వెల్లడించారు. అయితే ‘ట్రంప్, టెహ్రాన్ నాయకుల మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం. మేము అమెరికాకు సైన్యంతోనే సమాధానం చెబుతాము’ అని స్పష్టం చేసింది.

11, జూన్ 2026

బ్యాంకుల నగదు సరఫరా లోటు: గ్రామీణ ఏటీఎంలు ముందుగా దెబ్బతినే ప్రమాదం
బిజినెస్

బ్యాంకుల నగదు సరఫరా లోటు: గ్రామీణ ఏటీఎంలు ముందుగా దెబ్బతినే ప్రమాదం

దేశవ్యాప్తంగా ఏటీఎంలలో నగదు కొరత ప్రమాదం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌కు హెచ్చరించింది. బ్యాంకులు అవసరమైన పరిమాణంలో నగదు సరఫరా చేయలేకపోతే, ముఖ్యంగా గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలు, DBT లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని, ఏటీఎం నగదు సరఫరా వ్యవస్థను స్థిరంగా ఉంచేందుకు తక్షణ చర్యలు అవసరమని CATMi సూచించింది.

5, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters