నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు నుంచి ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గంటకు 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశముందని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో కూడిన వర్షాలు కొనసాగనున్నాయని అధికారులు పేర్కొన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి స్పష్టంగా లేకుండా వరుణుడు దోబూచులాడుతున్నాడని వాతావరణ కేంద్రం విశ్లేషించింది. అతిభారీ వర్షం కురిసేలా మబ్బులు కనిపిస్తున్నప్పటికీ, చిరుజల్లులు కురిసిన తర్వాత మబ్బులు చెదిరిపోతున్నాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణ పరిస్థితులపై కీలక అప్డేట్ ఇచ్చింది.

అల్పపీడనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం సమాచారం ప్రకారం నైరుతి రుతుపవనాల ఉత్తర సరిహద్దు రేఖ 24.5°N/65°E, బార్మేర్ , జోధాపూర్ , రఙ్గరః ( చూరు జిల్లా), బథిండా , 32.5°N/70°E గుండా కొనసాగుతోంది.

రాబోయే 2–3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు ఉత్తర అరేబియన్ సి , రాజస్థాన్ , హర్యానా , పంజాబ్ లోని మిగిలిన ప్రాంతాలతో పాటు దేశమంతటా మరింత ముందుకు సాగేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది.

నిన్న East మధ్య ప్రదేశ్ , పరిసర ప్రాంతాల్లో ఉన్న వెల్ - మర్కెద్ లౌ ప్రెషర్ ఏరియా ఈరోజు 8 జూలై 2026 ఉదయం 8:30 గంటల సమయంలో నార్త్వెస్ట్ మధ్యప్రదేశ్ , దానిని ఆనుకుని ఉన్న సౌత్వెస్ట్ ఉత్తర్ ప్రదేశ్ మీదుగా కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 9.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ దిశగా వంగి ఉందని వాతావరణ శాఖ వివరించింది.

ఈ వ్యవస్థ కొంతకాలం ఉత్తర–వాయువ్య దిశగా కదిలి, ఆ తర్వాత ఈశాన్య దిశగా మళ్లే అవకాశం ఉందని అంచనా వేసింది. ఈ వాతావరణ వ్యవస్థ తెలంగాణకు చాలా దూరంగా వెళ్లినందున, దీని ప్రభావం ఇకపై తెలంగాణ రాష్ట్ర వాతావరణంపై ఉండదని స్పష్టం చేసింది.

రాబోయే మూడు రోజులకు తెలంగాణ రాష్ట్ర వాతావరణ సూచన ప్రకారం, జూలై 8, 9, 10 తేదీల్లో రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ మూడు రోజులు తెలంగాణలో గంటకు 50 నుండి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశముందని హెచ్చరికలు జారీ చేసింది.

ఇదిలాఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. నైరుతి గాలుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఐదు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.