బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#మార్కెట్

6 articles

ముడి చమురు ధరలు తగ్గినా.. ఇంధన ధరలు తగ్గవు: కేంద్రం స్పష్టం
బిజినెస్

ముడి చమురు ధరలు తగ్గినా.. ఇంధన ధరలు తగ్గవు: కేంద్రం స్పష్టం

అమెరికా–ఇరాన్‌ ఒప్పందంతో ముడి చమురు ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, భారత్‌లో ఇంధన ధరలను వెంటనే తగ్గించే పరిస్థితి లేదని కేంద్రం స్పష్టం చేసింది. హర్మూజ్‌ జలసంధిలో రవాణా రద్దీ, పశ్చిమాసియా యుద్ధం సమయంలో చమురు కంపెనీలు చవిచూసిన నష్టాలు, కేంద్రం కోల్పోయిన ఆదాయం వంటి అంశాల వల్ల తక్షణ తగ్గింపు సాధ్యం కాదని సహాయ మంత్రి సురేశ్‌ గోపీ తెలిపారు.

18, జూన్ 2026

భారత్‌లో స్టార్‌లింక్‌ అనుమతులపై గందరగోళం..
బిజినెస్

భారత్‌లో స్టార్‌లింక్‌ అనుమతులపై గందరగోళం..

భారత్‌లో స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవల తుది అనుమతులపై అనిశ్చితి నెలకొనగా, ప్రభుత్వం క్లియరెన్స్‌ను నిలిపివేసిందన్న వార్తలను సంస్థ ఖండించింది. భారత ప్రభుత్వంతో చురుకైన, పారదర్శక చర్చలు కొనసాగుతున్నాయని స్టార్‌లింక్‌ బిజినెస్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లారెన్‌ డ్రేయర్‌ తెలిపారు. భద్రతా అంశాలపై అధికారులు ఇంకా నిశితంగా పరిశీలిస్తుండగా, మారుమూల ప్రాంతాల కనెక్టివిటీ కోసం ఈ సేవలపై ఆసక్తి కొనసాగుతోంది.

10, జూన్ 2026

ప్రీమియం సెగ్మెంట్‌లోకి Motorola Edge 70 Pro+ ప్రవేశం
బిజినెస్

ప్రీమియం సెగ్మెంట్‌లోకి Motorola Edge 70 Pro+ ప్రవేశం

మోటోరొలా ప్రీమియం విభాగంలో మోటోరోలా ఎడ్జ్‌ 70 ప్రో+ను రూ.47,999 ధరతో లాంచ్‌ చేసింది. 6.8 అంగుళాల 1.5K అమోలెడ్‌ డిస్‌ప్లే, 6500mAh బ్యాటరీ, 90W టర్బో ఛార్జింగ్‌, మీడియా టెక్ డిమెంసిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్‌, 50MP క్వాడ్‌ కెమెరా సెటప్‌, ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత హలో UI, IP68/IP69 రేటింగ్‌లతో ఈ ఫోన్‌ జూన్‌ 11 నుంచి ఫ్లిప్కార్ట్ , మోటోరోలా వెబ్‌సైట్‌ మరియు రిటైల్‌ స్టోర్లలో విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

4, జూన్ 2026

దేశంలో తొలి విద్యుత్‌ ఎస్‌యూవీగా టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ ఎబెల్లా లాంచ్‌
బిజినెస్

దేశంలో తొలి విద్యుత్‌ ఎస్‌యూవీగా టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ ఎబెల్లా లాంచ్‌

టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ దేశీయ మార్కెట్లో తొలి విద్యుత్‌ ఎస్‌యూవీగా టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ ఎబెల్లా ను రూ.23.60 లక్షల ఎక్స్‌షోరూమ్‌ ధరతో ఆవిష్కరించింది. మారుతీ సుజుకీ ఈ-విటారా ప్లాట్‌ఫామ్‌పై రూపొందించిన ఈ మిడ్‌ సైజ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ రెండు బ్యాటరీ వేరియంట్లలో లభించగా, 61 kWh వేరియంట్‌ ఒక్కసారి ఛార్జ్‌తో 543 కిలోమీటర్లు ప్రయాణించగలదు. ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్‌, పనోరమిక్‌ సన్‌రూఫ్‌, 7 ఎయిర్‌బ్యాగులు, లెవల్‌-2 అడాస్‌ వంటి ఫీచర్లతో ఇది హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌, ఎంజీ జడ్‌ఎస్‌, మారుతీ సుజుకీ ఈ-విటారా మోడళ్లకు పోటీగా నిలవనుంది.

4, జూన్ 2026

ఆర్‌బీఐ బంగారం నిల్వలు తగ్గలేదు, పెరిగాయి: అధికారిక డేటాతో కేంద్రం స్పష్టం
బిజినెస్

ఆర్‌బీఐ బంగారం నిల్వలు తగ్గలేదు, పెరిగాయి: అధికారిక డేటాతో కేంద్రం స్పష్టం

ఆర్‌బీఐ పెద్దఎత్తున బంగారం విక్రయించిందన్న బ్లూమ్‌బెర్గ్‌ కథనాన్ని కేంద్రం ఖండించింది. ఆర్‌బీఐ వద్ద ఉన్న బంగారం వాటా 2025లో 13.92 శాతం నుంచి 2026 మార్చి 31 నాటికి 16.70 శాతానికి, మే 22 నాటికి 16.85 శాతానికి పెరిగిందని గణాంకాలను చూపిస్తూ, ఇప్పటివరకు ఫిజికల్‌ గోల్డ్‌ నిల్వల్లో ఎలాంటి మార్పు లేదని, తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రభుత్వం స్పష్టం చేసింది.

3, జూన్ 2026

భారత్–ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి
బిజినెస్

భారత్–ఒమన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి

భారత్–ఒమన్ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సోమవారం నుంచి అమల్లోకి వచ్చినట్లు వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం అమలుతో భారతీయ ఎగుమతిదారులకు ఒమన

2, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters