బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#నిలిపివేశారు

5 articles

శ్రీశైలం పాతాళగంగ రోప్ వే సేవలు తాత్కాలిక నిలిపివేత
జిల్లా వార్తలు

శ్రీశైలం పాతాళగంగ రోప్ వే సేవలు తాత్కాలిక నిలిపివేత

శ్రీశైలం పాతాళగంగ రోప్ వే సేవలను ఏపి టూరిజం అధికారులు సుమారు 30 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. రోప్ వే నిర్మాణం పూర్తై 20 సంవత్సరాలు కావడంతో భక్తుల భద్రత దృష్ట్యా క్యాబిన్లు, తీగలు, యంత్రాంగంపై మెకానికల్ మెయింటెనెన్స్, సాంకేతిక మరమ్మతులు, తనిఖీలు చేపడుతున్నారు. ఈ సమయంలో భక్తులు మెట్ల మార్గం ద్వారా పాతాళగంగకు వెళ్లాల్సి ఉంటుందని, సేవలు పునఃప్రారంభించే తేదీని తరువాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

24, జులై 2026

జిందాల్ స్టీల్ ప్లాంట్ పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
రాజకీయాలు

జిందాల్ స్టీల్ ప్లాంట్ పరిశీలనకు వెళ్తున్న వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు

జిందాల్ స్టీల్స్ ప్లాంట్ పరిశీలనకు బయలుదేరిన వైయ‌స్ఆర్‌సీపీ నేతల బృందాన్ని పోలీసులు జమ్మలమడుగులోని వైయ‌స్ఆర్ విగ్రహం వద్ద అడ్డుకున్నారు. ప్లాంట్ సందర్శనకు అనుమతి లేదని పేర్కొంటూ ముందుకు కదలనివ్వకపోవడంతో వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.

1, జులై 2026

నల్లమలలోకి ప్రవేశంపై మూడు నెలల ఆంక్షలు
జిల్లా వార్తలు

నల్లమలలోకి ప్రవేశంపై మూడు నెలల ఆంక్షలు

నల్లమలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న 55 పులుల సంరక్షణ కేంద్రాల కోర్‌ ఏరియాల్లో జూలై నుంచి సెప్టెంబరు వరకు సాధారణ ప్రజల ప్రవేశం, జంగిల్‌ సఫారీలు, పుణ్యక్షేత్రాల సందర్శనపై అటవీశాఖ ఆంక్షలు విధించింది. పులుల సంతానోత్పత్తి కాలంలో వాటికి ఏకాంతం, ప్రశాంత వాతావరణం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొంటూ, ప్రజలు ఈ ఆంక్షలను అర్థం చేసుకుని సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

1, జులై 2026

భారత్‌లో Google Cloud సేవలకు అంతరాయం
బిజినెస్

భారత్‌లో Google Cloud సేవలకు అంతరాయం

దిల్లీలోని థర్డ్ పార్టీ డేటా సెంటర్‌లో అగ్నిప్రమాదం కారణంగా అక్కడి నెట్‌వర్క్ పరికరాలను నిలిపివేయడంతో భారత్‌లో గూగుల్ క్లౌడ్ ఆధారిత సేవలకు అంతరాయం ఏర్పడింది. బ్యాంకింగ్, ఈ-కామర్స్, ఆన్‌లైన్ సేవల రంగాల్లో లాగిన్, చెల్లింపులు, డేటా యాక్సెస్‌లో ఆటంకాలు ఎదురయ్యాయని వినియోగదారులు చెబుతున్నారు. అగ్నిప్రమాద కారణాలు, నష్టం వివరాలు ఇంకా వెల్లడించకపోయినా, ప్రభావిత ప్రాంతాల్లో సేవలను త్వరగా పునరుద్ధరించేందుకు గూగుల్ క్లౌడ్ సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయి.

10, జూన్ 2026

సత్యసాయి జిల్లాలో వందేభారత్‌కు తప్పిన ప్రమాదం
జిల్లా వార్తలు

సత్యసాయి జిల్లాలో వందేభారత్‌కు తప్పిన ప్రమాదం

సత్యసాయి జిల్లా హిందూపురం రైల్వే స్టేషన్‌ సమీపంలో కాచిగూడ–బెంగళూరు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలపైకి వచ్చిన రెండు ఆవులను ఢీకొనగా, లోకోపైలట్‌ అప్రమత్తంతో రైలు ఆపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దాదాపు అరగంట పరిశీలన తర్వాత రైలు సురక్షితమని అధికారులు నిర్ధారించి ప్రయాణం కొనసాగించారు. ఈ ఘటనలో ఎవరికి హాని జరగలేదని రైల్వే వర్గాలు స్పష్టం చేశాయి.

7, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters