బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#రాంప్రసాద్

26 articles

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్షలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి
జిల్లా వార్తలు

గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సీఎం సమీక్షలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి

2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్ సమీక్ష నిర్వహించగా, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సహా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రవాణా, ట్రాఫిక్, రహదారుల అభివృద్ధి, భద్రత, మౌలిక వసతుల కల్పనపై సమగ్రంగా చర్చించి, భక్తులకు ఇబ్బందులు లేకుండా ముందస్తు ప్రణాళికలు, జిల్లా స్థాయి సమీక్షలు, నిరంతర పర్యవేక్షణకు ముఖ్యమంత్రి సూచనలు జారీ చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

25, ఆగ 2026

దివ్యాంగుల జాతీయ టీ–20 క్రికెట్‌కు రావాలంటూ మంత్రికి జనసేన నేత ఆహ్వానం
జిల్లా వార్తలు

దివ్యాంగుల జాతీయ టీ–20 క్రికెట్‌కు రావాలంటూ మంత్రికి జనసేన నేత ఆహ్వానం

తిరుపతిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని కలిసిన జనసేన ఇన్‌చార్జ్ పసుపులేటి హరిప్రసాద్, అక్టోబర్ 13–18 మధ్య మంగళగిరి, అమరావతిలో జరగనున్న 9వ జాతీయ టీ–20 దివ్యాంగుల క్రికెట్ ఛాంపియన్‌షిప్ ప్రారంభానికి ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానించారు. దివ్యాంగ క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి రావడానికి ఇలాంటి జాతీయ స్థాయి పోటీలు దోహదం చేస్తాయని ఇరువురు నాయకులు అభిప్రాయపడ్డారు.

24, ఆగ 2026

రాయచోటి టీడీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా
జిల్లా వార్తలు

రాయచోటి టీడీపీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని తెలుగు దేశం పార్టీ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, దేశ స్వాతంత్ర్యం, అభివృద్ధి, ప్రజా సంక్షేమంపై ప్రసంగిస్తూ మహనీయుల త్యాగాలను స్మరించారు. కార్యక్రమంలో జాతీయ పతాకాల పంపిణీ, దేశభక్తి గీతాలు, పిల్లల సాంస్కృతిక ప్రదర్శనలు జరిగి, పట్టణమంతా దేశభక్తి వాతావరణం నెలకొంది.

15, ఆగ 2026

బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
జిల్లా వార్తలు

బోరెడ్డిగారిపల్లెలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లెలో తన స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి, తాగునీరు, రహదారులు, గృహాలు, పింఛన్లు, భూ వివాదాలు తదితర సమస్యలపై ప్రజల వినతులు స్వీకరించారు. ప్రతి అర్జీని పరిశీలించి సంబంధిత అధికారులకు పంపిస్తూ, ముఖ్యంగా ప్రాథమిక వసతుల సమస్యలను త్వరగా పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్టు స్థానికులు తెలిపారు.

14, ఆగ 2026

రాయచోటిలో రెండు తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభం
జిల్లా వార్తలు

రాయచోటిలో రెండు తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల ప్రారంభం

రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెండు నూతన తల్లి–బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల గర్భిణీలను సురక్షితంగా ఆసుపత్రులకు తరలించడం, ప్రసవానంతరం తల్లీబిడ్డలను ఇంటికి చేర్చడం లక్ష్యంగా ఈ సేవలను ప్రభుత్వం బలోపేతం చేస్తోంది. పేద, వెనుకబడిన వర్గాల గర్భిణీలకు అత్యవసర సమయంలో వేగంగా వైద్య సేవలు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

13, ఆగ 2026

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు
జిల్లా వార్తలు

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు

ఒంటిమిట్ట ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు, టిడిపి సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్యతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని శాలువా కప్పి సన్మానించి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ వైద్యుల సమస్యలు, సంక్షేమం, గ్రామీణ ఆరోగ్య సేవల్లో వారి పాత్రపై సానుకూలంగా చర్చించినట్టు ప్రతినిధులు తెలిపారు.

7, ఆగ 2026

చిన్నమండెం ఉర్దూ హైస్కూల్‌కు కంప్యూటర్లు విరాళం
జిల్లా వార్తలు

చిన్నమండెం ఉర్దూ హైస్కూల్‌కు కంప్యూటర్లు విరాళం

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలోని చిన్నమండెం ఉర్దూ హైస్కూల్‌కు కంప్యూటర్ల కొరత ఉండటంతో, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ తన సొంత నిధులతో కంప్యూటర్లు అందజేశారు. దీంతో అక్కడి విద్యార్థులకు డిజిటల్ విద్యాభ్యాసం, కంప్యూటర్ ప్రాక్టికల్ శిక్షణకు అనుకూల వాతావరణం ఏర్పడిందని ఉపాధ్యాయులు, స్థానికులు అభినందిస్తున్నారు.

5, ఆగ 2026

టి. చాకిబండ ప్రభుత్వ హైస్కూల్‌లో మంత్రి మండిపల్లి ఆకస్మిక తనిఖీ
జిల్లా వార్తలు

టి. చాకిబండ ప్రభుత్వ హైస్కూల్‌లో మంత్రి మండిపల్లి ఆకస్మిక తనిఖీ

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలంలోని టి. చాకిబండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించి, తరగతి గదులు, బోధన నాణ్యత, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన పథకం అమలు పరిస్థితులను తెలుసుకున్నారు. విద్యార్థుల రవాణా సమస్యలపై ఉపాధ్యాయులు, స్థానికుల వినతికి స్పందించిన మంత్రి, పాఠశాలకు బస్సు సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి, ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు.

5, ఆగ 2026

చిన్నమండెంలో రూ.50 లక్షల వ్యయంతో పశువైద్య ఆసుపత్రి భవనానికి భూమిపూజ
జిల్లా వార్తలు

చిన్నమండెంలో రూ.50 లక్షల వ్యయంతో పశువైద్య ఆసుపత్రి భవనానికి భూమిపూజ

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండల కేంద్రంలో పశుపాలకులకు మెరుగైన సేవలు అందించేందుకు రూ.50 లక్షల వ్యయంతో నూతన పశువైద్య ఆసుపత్రి భవన నిర్మాణానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి భూమిపూజ నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలను చేరువ చేయడంతో పాటు పశుపోషణకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించే అవకాశముందని అధికారులు తెలిపారు.

3, ఆగ 2026

స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్
జిల్లా వార్తలు

స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్

అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని పడమటి కోన గ్రామం బోరెడ్డిగారి పల్లెలో తన స్వగృహంలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి, రహదారులు, తాగునీరు, విద్యుత్, సంక్షేమ పథకాల అమలు వంటి సమస్యలపై ప్రజల వినతులు స్వీకరించారు. ప్రతి వినతిని ఓర్పుగా విని సంబంధిత అధికారులను అక్కడికక్కడే ఆదేశిస్తూ, ప్రజల సమస్యలకు త్వరిత పరిష్కారం ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.

2, ఆగ 2026

సెల్‌ఫోన్‌ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్‌ విధుల నుంచి తొలగింపు
జిల్లా వార్తలు

సెల్‌ఫోన్‌ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్‌ విధుల నుంచి తొలగింపు

పలమనేరు–మదనపల్లె మార్గంలో బస్సు నడుపుతూ సెల్‌ఫోన్‌ చూస్తూ ప్రయాణం కొనసాగించిన పలమనేరు డిపోకు చెందిన డ్రైవర్‌ కె. గణేష్‌కుమార్‌ను వీడియో ఆధారంగా గుర్తించి విధుల నుంచి వెంటనే తొలగించారు. ప్రయాణికుల భద్రతపై రాజీ ఉండదని మంత్రి రాంప్రసాద్‌రెడ్డి స్పష్టం చేయగా, ఇటువంటి నిర్లక్ష్యానికి పాల్పడే ఆర్టీసీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

1, ఆగ 2026

ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులకు ప్రారంభం
జిల్లా వార్తలు

ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులకు ప్రారంభం

అన్నమయ్య జిల్లా చిన్నమండెం మండలం ఎగువ బలిజపల్లిలో చెరువు అభివృద్ధి పనులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి హరితమ్మ, కుమారుడు శ్ నిశ్చల్ నాగిరెడ్డి ప్రారంభించారు. చెరువు పునరుద్ధరణతో సాగునీటి సౌకర్యం మెరుగై, నీటి నిల్వ సామర్థ్యం పెరిగి, పంటల విస్తీర్ణం, వరుస పంటల సాగు సాధ్యమవుతుందని స్థానికులు భావిస్తున్నారు. గ్రామాభివృద్ధి, రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాయకులు పేర్కొన్నారు.

1, ఆగ 2026

రాయచోటి సాకిబండ చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మండిపల్లి హరితమ్మ
జిల్లా వార్తలు

రాయచోటి సాకిబండ చెరువు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన మండిపల్లి హరితమ్మ

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం సాకిబండ గ్రామంలో చెరువు అభివృద్ధి పనులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సతీమణి మండిపల్లి హరితమ్మ శ్రీకారం చుట్టారు. చెరువు పునరుద్ధరణ, నీటి నిల్వ సామర్థ్య పెంపు, కాలువల సదృఢీకరణ ద్వారా సాగునీటి సౌకర్యం మెరుగుపడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని నాయకులు పేర్కొన్నారు. గ్రామీణ నీటి వనరుల అభివృద్ధి, రైతు సంక్షేమంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని వారు వివరించారు.

30, జులై 2026

ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు   : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాజకీయాలు

ఉత్తరాంధ్రకు మణిహారం భోగాపురం ఎయిర్‌పోర్టు : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

గత రెండేళ్లలో ఉత్తరాంధ్ర, విశాఖలో వినూత్నమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. విశాఖను దేశంలో నంబర్-1 నగరంగా తీర్చిదిద్దడమే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు.

27, జులై 2026

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్
రాజకీయాలు

డీఎస్సీపై విచారణకు సిద్ధం.. : వైసీపీకి మంత్రి మండిపల్లి కౌంటర్

ఏపీలో డీఎస్సీ నియామకాలపై వైసీపీ చేస్తున్న ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేకుండా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు మానుకోవాలని, విచారణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

25, జులై 2026

రవాణా రంగంలో ‘PM e-Bus Sewa’తో నూతన శకం ప్రారంభం
ఆంధ్రప్రదేశ్

రవాణా రంగంలో ‘PM e-Bus Sewa’తో నూతన శకం ప్రారంభం

కేంద్రం చేపట్టిన ‘PM e-Bus Sewa’ కార్యక్రమం కింద ఆంధ్రప్రదేశ్‌లో ఎలక్ట్రిక్ బస్సుల సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. విశాఖలో సింహపురి ఈ-బస్సు డిపో పవర్ రూమ్‌ను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించగా, విశాఖకు 100 ఈ-బస్సులు కేటాయించారు. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, గుంటూరు వంటి నగరాలకు కూడా ఈ-బస్సులు కేటాయిస్తూ, కాలుష్యాన్ని తగ్గించి ప్రజా రవాణా వ్యవస్థను ఆధునికీకరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తోంది.

25, జులై 2026

పోలీసు క్యాడర్ పునర్వర్గీకరణపై మంత్రి మండిపల్లికి అధికారుల వినతిపత్రం
జిల్లా వార్తలు

పోలీసు క్యాడర్ పునర్వర్గీకరణపై మంత్రి మండిపల్లికి అధికారుల వినతిపత్రం

రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి పోలీసు ఇన్‌స్పెక్టర్లు, అధికారులు వినతిపత్రం సమర్పించి ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ పోస్టును మల్టీ-జోనల్ క్యాడర్‌గా, DSP పోస్టును స్టేట్ క్యాడర్‌గా పునర్వర్గీకరించాలని కోరారు. పరిపాలనా సౌలభ్యం, సిబ్బంది నిర్వహణలో సమర్థత, రాష్ట్రవ్యాప్త సేవల అందుబాటు కోసం G.O.Ms.No.103లో సవరణలు చేయాలని విజ్ఞప్తి చేయగా, మంత్రి అంశాలను సానుకూలంగా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

23, జులై 2026

రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్
జిల్లా వార్తలు

రాయచోటి నియోజకవర్గంలో వైసీపీకి భారీ షాక్

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లె మండలంలో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మండల జడ్పీటీసీ రమాదేవి, మాజీ ఎంపీపీ అంబాబత్తిన రెడ్డయ్య ఆధ్వర్యంలో సుమారు 150 మంది వైసీపీ నేతలు, కార్యకర్తలు పార్టీకి రాజీనామా చేసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. ఈ చేరికతో టీడీపీ శక్తి పెరిగిందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నమయ్య జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకోవాలని పార్టీ నేతలు సంకల్పం వ్యక్తం చేస్తున్నారు.

19, జులై 2026

నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద అండగా: 73 మందికి రూ.63 లక్షల చెక్కుల పంపిణీ
జిల్లా వార్తలు

నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ పెద్ద అండగా: 73 మందికి రూ.63 లక్షల చెక్కుల పంపిణీ

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులతో వైద్య చికిత్స పొందలేని 73 మంది నిరుపేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రూ.63 లక్షల చెక్కులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఖరీదైన వైద్య చికిత్సకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యమని, అర్హులైన ప్రతి బాధితుడికి త్వరితగతిన సహాయం అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.

12, జులై 2026

ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి.. 8 మందికి గాయాలు
నేరాలు

ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి.. 8 మందికి గాయాలు

మార్కాపురం జిల్లా కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. . శుక్రవారం తెల్లవారుజామున ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోపైకి లారీ దూసుకెళ్లి నలుగురు మృతిచెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు.

3, జులై 2026

గాలివీడులో వీబీ–జీ రాంజీ ఉపాధి పథకం ప్రారంభం
జిల్లా వార్తలు

గాలివీడులో వీబీ–జీ రాంజీ ఉపాధి పథకం ప్రారంభం

అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం అరవీడు గ్రామంలో కేంద్ర ప్రభుత్వ వీబీ–జీ రాంజీ ఉపాధి పథకాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడం, పేద కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడం ప్రభుత్వ లక్ష్యమని అధికార వర్గాలు వెల్లడించాయి. పథకం అమలులో పారదర్శకత, గ్రామస్థాయి పర్యవేక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి సూచించినట్లు సమాచారం.

2, జులై 2026

మామిడి రైతులను ఆదుకుంటాం! : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
రాజకీయాలు

మామిడి రైతులను ఆదుకుంటాం! : మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి

మామిడి రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిత్తూరు జిల్లా ఇన్‌‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. గత ఏడాది మామిడి రైతులకు సుమారు రూ.190 కోట్లు చెల్లించి ప్రభుత్వం ఆదుకుందన్నారు.

30, జూన్ 2026

తప్పు చేసిన వారు తప్పించుకోలేరు! : మంత్రి రాంప్రసాద్‌రెడ్డి
రాజకీయాలు

తప్పు చేసిన వారు తప్పించుకోలేరు! : మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

ఆడుదాం ఆంధ్రా’ అక్రమాలపై విజిలెన్స్‌ నివేదిక త్వరలోనే  బయటకు వస్తుందని క్రీడలశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.  రూ.100 కోట్లకుపైగా ఇందులో అక్రమాలు జరిగాయని ఆరోపణలు ఉన్నాయన్న ఆయన.. తప్పు చేసిన వారు తప్పించుకోలేరన్నారు.

24, జూన్ 2026

టూరిస్ట్ బస్సులకు  పన్ను తగ్గిస్తూ క్యాబినెట్ నిర్ణయం!
ఆంధ్రప్రదేశ్

టూరిస్ట్ బస్సులకు పన్ను తగ్గిస్తూ క్యాబినెట్ నిర్ణయం!

రాష్ట్రంలో పర్యాటక, రవాణా రంగాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో టూరిస్ట్ బస్సుల నిర్వహణ భారాన్ని తగ్గించేలా.. పన్నుల తగ్గింపునకు రాష్ట్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

23, జూన్ 2026

చెప్పింది చేశాం.. చేసేవే చెబుతాం: చిత్తూరులో కూటమి నేతలు
జిల్లా వార్తలు

చెప్పింది చేశాం.. చేసేవే చెబుతాం: చిత్తూరులో కూటమి నేతలు

చిత్తూరు పీవీకేఎన్‌ డిగ్రీ కళాశాల మైదానంలో కూటమి ప్రభుత్వ సుపరిపాలన, రెండేళ్ల విజయోత్సవాల సభలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి సహా కూటమి నేతలు రాష్ట్రంలో హామీల అమలు, అభివృద్ధి, సంక్షేమం సమాంతరంగా కొనసాగుతున్నాయని తెలిపారు. గత రెండేళ్లలో చిత్తూరు జిల్లాకు వేల కోట్ల రూపాయల కేటాయింపులు, మామిడి రైతులకు ప్రోత్సాహకాలు, రోడ్లు, మౌలిక వసతుల అభివృద్ధి జరిగిందని, కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో కూటమి ప్రజలు కోరిన పరిపాలన అందిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.

20, జూన్ 2026

విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభం
జిల్లా వార్తలు

విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ ప్రారంభం

అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఏర్పాటు చేసిన CVAPU (Vision Action Plan Unit) కేంద్రాన్ని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. ఈ కేంద్రం ద్వారా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలు పర్యవేక్షణ వ్యవస్థీకృతంగా సాగి, పారదర్శకత, వేగం పెరుగుతాయని అధికారులు తెలిపారు. రాయచోటి నియోజకవర్గంలో మౌలిక సదుపాయాల విస్తరణ, ప్రజా సేవల మెరుగుదలపై నిరంతర పర్యవేక్షణకు ఈ యూనిట్ కీలకంగా ఉపయోగపడనుంది.

6, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters