బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#శ్రీశైలంలో

8 articles

కేసీ కెనాల్‌కు వెంటనే సాగునీరు విడుదల చేయాలి: పుత్తా లక్ష్మిరెడ్డి డిమాండ్
జిల్లా వార్తలు

కేసీ కెనాల్‌కు వెంటనే సాగునీరు విడుదల చేయాలి: పుత్తా లక్ష్మిరెడ్డి డిమాండ్

ప్రజా పక్షం అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి, కేసీ కెనాల్ ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. శ్రీశైలం జలాశయంలోని నీటిని ప్రాధాన్యంగా కేసీ కెనాల్ వరి పంటలకు కేటాయించి, నీటి పట్టికను స్పష్టంగా ప్రకటించాలని, లేకపోతే పంటలు ఎండిపోవడంతో రైతులు భారీ నష్టాలు చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు.

31, ఆగ 2026

శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నేత రాచమల్లు కుటుంబం
జిల్లా వార్తలు

శ్రీశైలంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన వైఎస్సార్సీపీ నేత రాచమల్లు కుటుంబం

వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, ఆయన సతీమణి రమాదేవి, కుటుంబ సభ్యులు శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించగా, రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని కుటుంబ సభ్యులు ప్రార్థించారు.

3, ఆగ 2026

శ్రీశైలం పాతాళగంగ రోప్ వే సేవలు తాత్కాలిక నిలిపివేత
జిల్లా వార్తలు

శ్రీశైలం పాతాళగంగ రోప్ వే సేవలు తాత్కాలిక నిలిపివేత

శ్రీశైలం పాతాళగంగ రోప్ వే సేవలను ఏపి టూరిజం అధికారులు సుమారు 30 రోజుల పాటు తాత్కాలికంగా నిలిపివేశారు. రోప్ వే నిర్మాణం పూర్తై 20 సంవత్సరాలు కావడంతో భక్తుల భద్రత దృష్ట్యా క్యాబిన్లు, తీగలు, యంత్రాంగంపై మెకానికల్ మెయింటెనెన్స్, సాంకేతిక మరమ్మతులు, తనిఖీలు చేపడుతున్నారు. ఈ సమయంలో భక్తులు మెట్ల మార్గం ద్వారా పాతాళగంగకు వెళ్లాల్సి ఉంటుందని, సేవలు పునఃప్రారంభించే తేదీని తరువాత ప్రకటిస్తామని అధికారులు తెలిపారు.

24, జులై 2026

శ్రీశైలంలో నందీశ్వర స్వామికి విశేషార్చనలు
జిల్లా వార్తలు

శ్రీశైలంలో నందీశ్వర స్వామికి విశేషార్చనలు

శ్రీశైల దేవస్థానంలో మంగళవారం ప్రదోషకాలంలో నందీశ్వర స్వామికి విశేషార్చనలు, అభిషేకాలు, పుష్పార్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున జరిగే ఈ దేవస్థాన సేవలో దేశ శాంతి, సౌభాగ్యం, సకాలంలో వర్షాలు, ప్రజల ఆయురారోగ్యాలు, ప్రమాదాలు సంభవించకుండా ఉండాలని అర్చకులు, వేదపండితులు సంకల్పం చేసి, మహాగణపతి పూజతో కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ముగించారు.

22, జులై 2026

శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి సహస్రదీపార్చన సేవ
జిల్లా వార్తలు

శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి సహస్రదీపార్చన సేవ

జ్యోతిర్లింగక్షేత్రమైన శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి దేవస్థానం ఆధ్వర్యంలో సహస్రదీపార్చన సేవను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పురాతన మండపంలో వెయ్యి దీపాలు వెలిగించి, వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు, నైవేద్యాలు, హారతులు సమర్పించారు. అనంతరం ఉత్సవమూర్తులను వెండి రథంపై ఆలయ ప్రదక్షిణ చేయగా, భక్తులు రథయాత్రను దర్శించి పుణ్యప్రదమని భావించారు.

21, జులై 2026

శ్రీశైలంలో మీడియాపై ఆంక్షలు సరికాదు: APUWJ జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయ్ రాయల్
జిల్లా వార్తలు

శ్రీశైలంలో మీడియాపై ఆంక్షలు సరికాదు: APUWJ జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయ్ రాయల్

APUWJ జిల్లా కార్యవర్గ సభ్యుడు విజయ్ రాయల్ శ్రీశైల దేవస్థానం మీడియాపై విధించిన ఆంక్షలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ప్రోటో కాల్ పేరుతో దళారులను అరికట్టలేని అధికారులు మీడియాను మాత్రమే నిరోధించడం పునరాలోచనీయమని పేర్కొన్నారు. దేవస్థానం చైర్మన్, ఈవో వెంటనే ఆంక్షలను ఎత్తివేయాలని, కొనసాగితే యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

19, జులై 2026

శ్రీశైలంలో  స్పర్శ దర్శనంలో కీలక మార్పులు
జిల్లా వార్తలు

శ్రీశైలంలో స్పర్శ దర్శనంలో కీలక మార్పులు

శ్రీశైలం శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి ఆలయ అధికారులు విరామ (స్పర్శ) దర్శన విధానంలో కీలక మార్పులు చేశారు. క్షేత్రానికి రోజురోజుకూ పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా నేటి (ఆదివారం) నుంచి కొత్త నిబంధనలు అమలు చేస్తున్నట్లు ప్రకటించారు.

19, జులై 2026

శ్రీశైలంలో భక్తుల రద్దీ: మల్లన్న దర్శనానికి నాలుగు గంటల సమయం
జిల్లా వార్తలు

శ్రీశైలంలో భక్తుల రద్దీ: మల్లన్న దర్శనానికి నాలుగు గంటల సమయం

శ్రీశైలం మల్లన్న దేవస్థానంలో భక్తుల భారీ రద్దీ కొనసాగుతోంది. సాధారణ దర్శనానికి సుమారు నాలుగు గంటలు పడుతుండడంతో శని, ఆది, సోమవారాల్లో ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చన సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. VIP బ్రేక్ దర్శనాన్ని ఉదయం 7:30, రాత్రి 9 గంటలకు మాత్రమే అనుమతిస్తూ, క్యూలైన్లలో ఉన్న భక్తులకు అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు అందించే ఏర్పాట్లు చేశారు.

15, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters