బ్రేకింగ్ న్యూస్
ఎర్రగుడిపాడు ఆలయ ఘటనపై స్పందించిన అధికారులు.. దళితులకు స్వామివారి దర్శనంప్రొద్దుటూరులో TNSF ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ముగింపులైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలు
Search

TAG

#తిరుపతికి

6 articles

ప్రపంచ ప్రకృతి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం
జిల్లా వార్తలు

ప్రపంచ ప్రకృతి దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం

ప్రపంచ ప్రకృతి దినోత్సవం సందర్భంగా తిరుపతి ఇండియన్స్ అసోసియేషన్ అఫ్ ఎడ్యుకేషన్ , సోషల్ అవేర్నెస్ అండ్ నేచర్ రెస్పాన్సిబిలిటీ ఆధ్వర్యంలో చంద్రగిరి జూనియర్ కళాశాలలో ప్రకృతి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో పర్యావరణ స్పృహ పెంపొందించేందుకు ప్లాంట్ ఎకో ల్యాబ్‌లో పెంచిన మొక్కలను డా. జి. రామకృష్ణ పంపిణీ చేసి, గాలి, నీరు, నేల, మొక్కల సంరక్షణలో ప్రతి ఒక్కరి బాధ్యతను వివరించారు.

5, అక్టో 2026

తిరుపతి ఘాట్ రోడ్‌లో కారు బోల్తా – వృద్ధుడు మృతి, నలుగురికి గాయాలు
జిల్లా వార్తలు

తిరుపతి ఘాట్ రోడ్‌లో కారు బోల్తా – వృద్ధుడు మృతి, నలుగురికి గాయాలు

తిరుమల నుండి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్ రోడ్‌లో 22వ మలుపు వద్ద కారు బోల్తా పడడంతో సతీష్ కుమార్ (72) మృతి చెందగా, నలుగురికి స్వల్ప గాయాలు అయ్యాయి. బెంగళూరు బన్నేరుఘట్ట రోడ్, Gottigere ప్రాంతానికి చెందిన ఈ కుటుంబం శ్రీవారి దర్శనం ముగించుకుని తిరుపతికి వస్తుండగా, కారు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడం వల్ల వాహనం నియంత్రణ కోల్పోయి ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

8, ఆగ 2026

చిత్తూరు జిల్లా వీకోట ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళల మృతి
జిల్లా వార్తలు

చిత్తూరు జిల్లా వీకోట ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మహిళల మృతి

చిత్తూరు జిల్లా వీకోట మండలం రామాపురం సమీపంలోని ఎక్స్ప్రెస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరుపతి వాస్తవ్యులైన గౌతమి, మానస అనే ఇద్దరు మహిళలు మృతి చెందగా, భర్త అనిల్‌తో పాటు మరో ఇద్దరు యువకులు గాయపడ్డారు. బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్న కారు టైర్ పంచర్ కావడంతో ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

7, ఆగ 2026

తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం
జిల్లా వార్తలు

తిరుపతి శ్రీవారి మెట్ల మార్గంలో యువతి అదృశ్యం

తిరుపతి అలిపిరి మెట్ల మార్గంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఈస్ట్ కోడిపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుటుంబంలోని యువతి అకస్మాత్తుగా అదృశ్యమైంది. కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనతో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో ఆంజనేయులు తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తూ, మెట్ల మార్గం పరిసరాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.

6, ఆగ 2026

హైదరాబాద్‌-తిరుపతి విమాన టికెట్లకు భారీ డిమాండ్
బిజినెస్

హైదరాబాద్‌-తిరుపతి విమాన టికెట్లకు భారీ డిమాండ్

హైదరాబాదు నుంచి తిరుపతికి నడిచే విమాన సర్వీసులకు ఇటీవల డిమాండ్ నెలకొంది. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుపతి విమానాశ్రయంలో టీటీడీ శ్రీవాణి కౌంటర్‌ను ఏర్పాటు చేసింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్న 2 గంటల వరకు ఈ టికెట్లు జారీచేస్తుంది.

15, జులై 2026

కర్నూలు–నంద్యాల జాతీయ రహదారిపై తప్పిన బస్సు ప్రమాదం
జిల్లా వార్తలు

కర్నూలు–నంద్యాల జాతీయ రహదారిపై తప్పిన బస్సు ప్రమాదం

కర్నూలు–నంద్యాల జాతీయ రహదారిపై పాణ్యం సమీపంలో హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్తున్న ప్రైవేట్ బస్సు టైర్ అకస్మాత్తుగా పేలిపోవడంతో బస్సు డివైడర్‌పైకి ఎగబాకినా, బోల్తా పడకపోవడంతో 27 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు సురక్షితంగా బయటపడ్డారు. బస్సుకు స్వల్ప నష్టం మాత్రమే కాగా, పాణ్యం పోలీసులు కేసు నమోదు చేసి టైర్ పేలడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

13, జులై 2026

We Are Hiring – Anchors + Copywriters