రాయలసీమ న్యూస్, అగ్రికల్చర్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో కాటన్ కార్పొరేషన్ అఫ్ ఇండియా (CCI) ద్వారా జరిగే పత్తి కొనుగోళ్లపై రాష్ట్ర ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. రైతులు తమ పత్తిని ప్రభుత్వ గుర్తింపు పొందిన కేంద్రాల్లోనే విక్రయించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఇందుకోసం ముందస్తుగా స్లాట్ బుకింగ్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది.
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం, CCI గుర్తించిన మార్కెట్ యార్డులు, మార్కెటింగ్ శాఖ సిఫార్సు చేసిన కేంద్రాలు, జాయింట్ కలెక్టర్ లు నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్ లలోనే పత్తి కొనుగోళ్లు జరగనున్నాయి. ఈ కేంద్రాల జాబితాను సంబంధిత జిల్లాల వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు రైతులకు తెలియజేయనున్నాయి.
రైతులు తమ పత్తిని విక్రయించేందుకు ముందుగా క్యాపస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. యాప్‌లో నమోదు చేసుకున్న తర్వాతే కొనుగోలు కేంద్రాలకు పత్తి తీసుకురావాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. స్లాట్ బుకింగ్ ద్వారా రైతులకు నిర్దిష్ట తేదీ, సమయం కేటాయించి, కొనుగోలు ప్రక్రియను సక్రమంగా నిర్వహించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
పత్తి నాణ్యత విషయంలో కూడా ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. లూజుగా ఉన్న పత్తినే కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, ఇతర పదార్థాలు కలిసిన పత్తిని స్వీకరించబోమని పేర్కొంది. పత్తిని కేంద్రాలకు తీసుకురావడానికి ముందు రైతులు శుభ్రపరిచి, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సిద్ధం చేసుకోవాలని సూచించింది.
చెల్లింపుల విషయంలో రైతులకు నేరుగా బ్యాంకు ఖాతాల్లోనే డబ్బు జమ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆధార్‌కు లింక్ అయిన బ్యాంకు అకౌంట్లకే చెల్లింపులు జరగనున్నాయని స్పష్టం చేసింది. దీంతో చెల్లింపుల్లో పారదర్శకత, ఆలస్యం లేకుండా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
‘CCI గుర్తించిన, మార్కెటింగ్ శాఖ సిఫార్సు చేసిన మార్కెట్ యార్డులు, జాయింట్ కలెక్టర్లు నోటిఫై చేసిన జిన్నింగ్ మిల్లుల్లోనే పత్తి కొనుగోలు చేస్తారు. రైతులు కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలి. లూజుగా ఉన్న పత్తినే కేంద్రాలకు తీసుకురావాలి. ఆధార్‌లో లింక్ అయిన బ్యాంకు అకౌంట్లకే చెల్లింపులు జరుగుతాయి’ అని పేర్కొంది.
ఈ మార్గదర్శకాలు అమల్లోకి వచ్చిన తర్వాత పత్తి కొనుగోలు ప్రక్రియ మరింత క్రమబద్ధంగా, పారదర్శకంగా సాగుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రైతులు కొత్త విధానంపై పూర్తి సమాచారం సేకరించి, Kapas Kisan యాప్ వినియోగంపై అవగాహన పెంచుకోవాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు.







