రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. గుంతకల్లు పట్టణం 14, 03 వార్డు సచివాలయం పరిధిలోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో కొత్త సీసీ కల్వర్ట్ నిర్మాణ పనులను అధికారులు ప్రారంభించారు.
గుంతకల్లు నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరాం, గుంతకల్లు పట్టణ ఇంచార్జ్ శ్రీ గుమ్మనూరు నారాయణ స్వామి ఆదేశాల మేరకు ఈ పనులు చేపట్టారు. రాజేంద్ర నగర్‌లోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్చ్ ఎదురుగా సంతోష్ నగర్‌కు వెళ్లే రహదారి వద్ద 3.5 మీటర్ల పొడవుతో సీసీ కల్వర్ట్ నిర్మాణాన్ని ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.
ఈ కల్వర్ట్ నిర్మాణంతో స్థానికంగా వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తగ్గి, రహదారి రవాణా సౌకర్యం మెరుగుపడే అవకాశం ఉందని వార్డు ప్రజలు అభిప్రాయపడ్డారు. అభివృద్ధి పనులు వేగంగా జరుగుతుండటంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, గుంతనూరు నారాయణ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. అభివృద్ధి పనులకు స్పందించి, కల్వర్ట్ నిర్మాణానికి అనుమతులు, సాంకేతిక సహకారం అందించిన మునిసిపల్ కమిషనర్ లక్ష్మిదేవి, ME ఇంతియాజ్, DE శభానా, AE హారకృష్ణలకు కూడా ప్రజలు ధన్యవాదాలు తెలిపారు.
కల్వర్ట్ పనుల ప్రారంభ కార్యక్రమంలో 14వ వార్డు ఇంచార్జ్ శ్రీమతి N. పద్మావతి, 14వ వార్డు ప్రధాన కార్యదర్శి G. R. చిన్న ఎల్లప్ప, తాటాకుల క్రిష్ణ, వాల్మీకి లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, నివాసితులు కలిసి పనుల ప్రారంభాన్ని వీక్షించారు.
గుంతకల్లు నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో రహదారులు, డ్రైనేజీ, కాల్వర్ట్‌లు వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం పెరిగింది. ఈ క్రమంలో రాజేంద్ర నగర్–సంతోష్ నగర్ రహదారి వద్ద చేపట్టిన సీసీ కల్వర్ట్ నిర్మాణం స్థానిక ప్రజలకు ఉపయోగకరంగా ఉండనుందని అధికారులు పేర్కొన్నారు.













