బ్రేకింగ్ న్యూస్
లైంగిక వేధింపుల కేసులో దర్శక నిర్మాత షకీల్ నూరానీ అరెస్ట్వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో ఇంటిలో అగ్ని ప్రమాదంముచ్చుకోట వద్ద పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అనంత వెంకటరామిరెడ్డి అరెస్ట్‌అనంతపురం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం… 20 మందికి గాయాలుప్రొద్దుటూరులో వైసీపీ నిరసన ర్యాలీ పోలీసలు అడ్డు
Search

TAG

#సచివాలయం

30 articles

సచివాలయాల్లో పిర్యాదుల రిజిస్టర్ ఏర్పాటు: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్
జిల్లా వార్తలు

సచివాలయాల్లో పిర్యాదుల రిజిస్టర్ ఏర్పాటు: ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్

ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. పట్టణంలోని 45 వార్డు సచివాలయాల్లో ప్రత్యేక పిర్యాదుల రిజిస్టర్‌లు ఏర్పాటు చేశామని, ప్రజలు తమ ప్రాంత సమస్యలను నేరుగా అక్కడ నమోదు చేయవచ్చని చెప్పారు. పిర్యాదుల స్వభావాన్ని బట్టి సంబంధిత శాఖలకు పంపించి చర్యలు తీసుకునే విధంగా వ్యవస్థను రూపొందించామని, అత్యవసర సేవలకు ఆదివారాలు, సెలవు రోజుల్లో కూడా పిర్యాదులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

24, ఆగ 2026

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు
జిల్లా వార్తలు

మంత్రి రాంప్రసాద్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు

ఒంటిమిట్ట ఆర్ఎంపీ వైద్యుల ప్రతినిధులు, టిడిపి సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్యతో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాష్ట్ర సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రిని శాలువా కప్పి సన్మానించి, ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి చిత్రపటాన్ని జ్ఞాపికగా అందజేశారు. ఈ సందర్భంగా ఆర్ఎంపీ వైద్యుల సమస్యలు, సంక్షేమం, గ్రామీణ ఆరోగ్య సేవల్లో వారి పాత్రపై సానుకూలంగా చర్చించినట్టు ప్రతినిధులు తెలిపారు.

7, ఆగ 2026

నైపుణ్యాభివృద్ధి, విదేశీ ఉపాధిపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం
తెలంగాణ

నైపుణ్యాభివృద్ధి, విదేశీ ఉపాధిపై సీఎం రేవంత్ సమీక్షా సమావేశం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నైపుణ్యాభివృద్ధి, విదేశీ ఉపాధి విస్తరణపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి, Young India Skill University ఆధునీకరణ, రీసెర్చ్ సెంటర్, విదేశీ భాషల ప్రత్యేక వింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లు, ఎలక్ట్రిక్ వెహికల్, డ్రోన్ టెక్నాలజీ కోర్సులు, TOMCOM ద్వారా విదేశీ ఉపాధి పర్యవేక్షణ, కొత్త నర్సింగ్ కళాశాలల స్థాపనకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

31, జులై 2026

వేగంగా అమరావతి నిర్మాణ పనులు :   పనుల పురోభివృద్ధి సమీక్షించిన సీఎం బాబు
ఆంధ్రప్రదేశ్

వేగంగా అమరావతి నిర్మాణ పనులు : పనుల పురోభివృద్ధి సమీక్షించిన సీఎం బాబు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులకు మరింత వేగం, నాణ్యత, సమయపాలనపై దృష్టి పెట్టాలని అధికారులకు, నిర్మాణ సంస్థలకు ఆదేశించారు. 95 ప్రాజెక్టులపై రూ.50,999 కోట్ల విలువైన పనులు జరుగుతున్నాయని, ప్రతి నెల కనీసం 7.92 శాతం పురోగతి సాధించి నిర్ణయించిన గడువులో పూర్తి చేయాలని సూచించారు. అమరావతి అభివృద్ధిలో విజయవాడ, గుంటూరు నగరాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, పచ్చదనం, ఆధునిక మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు.

29, జులై 2026

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం చంద్రబాబు సూచనలు
ఆంధ్రప్రదేశ్

ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించాలి: సీఎం చంద్రబాబు సూచనలు

ఎల్‌నినో ప్రభావం కారణంగా రాష్ట్రంలో వాతావరణ మార్పులు తీవ్రంగా ఉండే అవకాశాల నేపథ్యంలో రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం తగ్గించేందుకు వ్యవసాయ, వాతావరణ శాఖలు, ఆర్టీజీఎస్, రైతు సంఘాలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు సమన్వయంతో పనిచేసి గ్రామస్థాయిలో పంటల సలహాలు, శిక్షణా కార్యక్రమాలను విస్తరించాలని సమావేశంలో సూచించారు.

28, జులై 2026

సిలిండర్ల సరఫరాలో పారదర్శకతకు చర్యలు: జెసీ ఆదర్శ్ రాజేంద్రన్
జిల్లా వార్తలు

సిలిండర్ల సరఫరాలో పారదర్శకతకు చర్యలు: జెసీ ఆదర్శ్ రాజేంద్రన్

చిత్తూరు జిల్లాలో ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సమయపాలన, భద్రతా ప్రమాణాల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ అధికారులకు, డీలర్లకు సూచించారు. వినియోగదారులకు సకాలంలో సిలిండర్లు అందేలా చూడడం, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించడం, నిల్వల వివరాలు, పంపిణీ రికార్డులను సక్రమంగా నిర్వహించడం ద్వారా సేవల నాణ్యతను మెరుగుపరచాలని ఆయన ఆదేశించారు.

27, జులై 2026

ఇన్సూరెన్స్ డబ్బులతో తండ్రి చికిత్స చేయించాలని సూసైడ్ లెటర్‌లో యువతి విజ్ఞప్తి
జిల్లా వార్తలు

ఇన్సూరెన్స్ డబ్బులతో తండ్రి చికిత్స చేయించాలని సూసైడ్ లెటర్‌లో యువతి విజ్ఞప్తి

తిరుపతి జిల్లాలో ANM‌గా పనిచేస్తున్న సాయిచందన (27) తండ్రి అనారోగ్య చికిత్స కోసం ఇన్సూరెన్స్ డబ్బులు వినియోగించాలని సూసైడ్ లెటర్ రాసి కార్యాలయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. రూ.60 లక్షల ఇన్సూరెన్స్ పాలసీపై క్లెయిమ్ సులభం కావడానికి తన మరణాన్ని పాముకాటు లేదా కరెంట్ షాక్‌గా నమోదు చేయాలని లేఖలో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూ, కుటుంబ ఆర్థిక పరిస్థితులు, వైద్య ఖర్చుల అంశాలను పరిశీలిస్తున్నారు.

24, జులై 2026

‘మీ భూమి- బ్లాక్‌చెయిన్‌’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
రాజకీయాలు

‘మీ భూమి- బ్లాక్‌చెయిన్‌’ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

‘మీ భూమి- బ్లాక్‌చెయిన్‌’ పైలట్ ప్రాజెక్టును సచివాలయం నుంచి సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ మండలాల్లో రీసర్వే పూర్తయిన 89 గ్రామాల్లోని 1,37,763 పార్సెల్‌ మ్యాప్‌లు ప్రాజెక్టు పరిధిలోకి రానున్నాయి.

23, జులై 2026

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు–యూఏఈ మంత్రివర్గ ప్రతినిధి భేటీ
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు–యూఏఈ మంత్రివర్గ ప్రతినిధి భేటీ

రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యూఏఈ ఆర్ధిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఆర్ధిక, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు, భాగస్వామ్య అవకాశాలపై చర్చించారు. పరిశ్రమలు, మౌలిక వసతులు, పర్యాటక సౌకర్యాల అభివృద్ధి, విధానపరమైన ప్రోత్సాహకాలపై ప్రాథమిక స్థాయి చర్చలు జరగగా, భవిష్యత్‌లో మరిన్ని సమావేశాలు, పెట్టుబడుల రూపంలో పురోగతి సాధ్యమని అధికార వర్గాలు సూచిస్తున్నాయి.

21, జులై 2026

గుంతకల్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం – రాజేంద్ర నగర్‌లో సీసీ కల్వర్ట్ నిర్మాణం ప్రారంభం
జిల్లా వార్తలు

గుంతకల్లు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగం – రాజేంద్ర నగర్‌లో సీసీ కల్వర్ట్ నిర్మాణం ప్రారంభం

అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గం రాజేంద్ర నగర్‌లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆర్చ్ ఎదురుగా సంతోష్ నగర్ రహదారి వద్ద 3.5 మీటర్ల పొడవుతో సీసీ కల్వర్ట్ నిర్మాణ పనులు అధికారులు ప్రారంభించారు. ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, పట్టణ ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ స్వామి ఆదేశాల మేరకు చేపట్టిన ఈ పనులతో వర్షాకాలంలో నీటి నిల్వ సమస్యలు తగ్గి రహదారి రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.

18, జులై 2026

లోక్‌సభలో స్మార్ట్ వాచీలు, పెన్ కెమెరాలకు నో ఎంట్రీ
జాతీయం

లోక్‌సభలో స్మార్ట్ వాచీలు, పెన్ కెమెరాలకు నో ఎంట్రీ

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా లోక్‌సభ సచివాలయం కొత్త మార్గదర్శకాలు జారీ చేసి, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ కళ్లద్దాలు, పెన్ కెమెరాలు వంటి ఆడియో, వీడియో రికార్డింగ్ సామర్థ్యం ఉన్న పరికరాలను సభలోకి తీసుకురావడాన్ని నిషేధించింది. సభ్యుల వ్యక్తిగత గోప్యత, భద్రతను కాపాడటం, సభా కార్యకలాపాలు నిరంతరాయంగా సాగేందుకు ఈ నియమాలు అమలు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

16, జులై 2026

ఏపీలో రెండో విడత జాబ్ క్యాలెండర్‌కి కసరత్తు
ఉద్యోగాలు

ఏపీలో రెండో విడత జాబ్ క్యాలెండర్‌కి కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత జాబ్ క్యాలెండర్ రూపకల్పనకు ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. ఈ విడతలో 3,168 పోస్టులు, అందులో నిరుద్యోగులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 91 Group-1 పోస్టులు భర్తీ చేయాలని యోచిస్తోంది. ఆగస్టు 15న నోటిఫికేషన్లు జారీ చేసే దిశగా ఏర్పాట్లు జరుగుతుండగా, కొత్త Local Cadre విధానం, Reservation Roster, ఖాళీల వివరాలపై సీఎస్ సాయిప్రసాద్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

14, జులై 2026

విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్లు   సీఎం బాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఆమోదం
రాజకీయాలు

విలేజ్ డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్‌కు రూ.9,355 కోట్లు సీఎం బాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఆమోదం

వెలగపూడి సచివాలయంలో జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో అమరావతి ల్యాండ్ పూలింగ్ రైతులకు మెట్ట భూములకు ఎకరాకు రూ.40 వేల, జరీబు భూములకు రూ.60 వేల వార్షిక కౌలు పెంపు, నిర్వాసితులకు నెలకు రూ.10 వేల అద్దె సాయం, వ్యవసాయ రుణమాఫీ ప్రతిపాదనలపై ముందడుగు వేసింది. ఆర్ట్ ఆఫ్ లివింగ్, ఈశా ఫౌండేషన్, CII సహా పలు సంస్థలకు భూ కేటాయింపులు, SIPB ఆమోదించిన 11 మెగా ప్రాజెక్టులకు క్లియరెన్స్ ద్వారా రూ.9,076 కోట్ల పెట్టుబడులు, 10,531 ఉద్యోగాలు సృష్టించే దిశగా నిర్ణయాలు తీసుకోనుంది.

10, జులై 2026

హాస్టళ్ల మెస్ ఛార్జీలు పెంచిన ఏపీ సర్కార్
రాజకీయాలు

హాస్టళ్ల మెస్ ఛార్జీలు పెంచిన ఏపీ సర్కార్

హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంక్షేమ శాఖల మంత్రులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సచివాలయంలో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

8, జులై 2026

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం : సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ప్రభుత్వ సేవలు మరింత సులభతరం : సీఎం చంద్రబాబు

ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్‌ సెంటర్‌ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు.

29, జూన్ 2026

ఆర్టీజీఎస్‌పై మంత్రి నారా లోకేష్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్

ఆర్టీజీఎస్‌పై మంత్రి నారా లోకేష్ సమీక్ష

మంత్రి నారా లోకేష్ సచివాలయంలో ఆర్టీజీఎస్, డేటాలేక్ పనితీరును సమీక్షించి, అన్ని పనులను జూలై నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డుల సేవలను సులభతరం చేసి, డిజిటల్ వ్యవస్థలను బలోపేతం చేయాలని సూచించారు. ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని కూడా ఆయన ఆదేశించారు.

26, జూన్ 2026

జులై 8న అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం
ఆంధ్రప్రదేశ్

జులై 8న అమరావతిలో ఏపీ కేబినెట్ సమావేశం

జులై 8న అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనంతరం జరుగుతున్న ఈ సమావేశంలో పరిపాలన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, మౌలిక వసతుల విస్తరణ, పెట్టుబడుల ఆకర్షణ వంటి కీలక అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశముందని అధికార వర్గాలు సూచిస్తున్నాయి. అధికారిక అజెండాను ప్రభుత్వం ఇంకా ప్రకటించకపోయినా, సమావేశం అనంతరం మంత్రివర్గ నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు.

26, జూన్ 2026

సినీ, ఏఐ రంగాల్లో యువతకు శిక్షణ.. :  మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన
రాజకీయాలు

సినీ, ఏఐ రంగాల్లో యువతకు శిక్షణ.. : మంత్రి కందుల దుర్గేష్ కీలక ప్రకటన

నవ్యాంధ్రలో సరికొత్త ‘క్రియేటివ్ ఎకానమీ విప్లవం’కు శ్రీకారం చుట్టనున్నట్లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. యువతకు ఆధునిక సినీ సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణను రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

25, జూన్ 2026

11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం
ఆంధ్రప్రదేశ్

11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ 2004కు ముందు సేవలో చేరిన సుమారు 11 వేల మంది ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని నిర్ణయించింది. వెలగపూడి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో పెట్టుబడుల పెంపు, ఉపాధి అవకాశాల సృష్టి, పరిశ్రమలు, ఐటీ, పర్యాటక రంగాల అభివృద్ధికి సంబంధించిన అనేక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, సుమారు 34 వేల కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

24, జూన్ 2026

ప్రభుత్వంపై దుష్ప్రచారం..: అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
రాజకీయాలు

ప్రభుత్వంపై దుష్ప్రచారం..: అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

పీజీఆర్ఎస్ అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు.

22, జూన్ 2026

రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు.. : మంత్రి అచ్చెన్న వార్నింగ్
వ్యవసాయం

రైతులను ఇబ్బంది పెడితే డీలర్లపై క్రిమినల్ కేసులు.. : మంత్రి అచ్చెన్న వార్నింగ్

రైతులను ఇబ్బంది పెడితే డీల‌ర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, కంపెనీల‌పై కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో ఖరీఫ్-2026 ఎరువుల లభ్యత, పంపిణీపై మంత్రి సమీక్ష నిర్వహించారు.

22, జూన్ 2026

భక్తులు కోరితే దేవుడి మందిరాలు! : రెండేళ్ల పనితీరుపై రిపోర్టు విడుదల
రాజకీయాలు

భక్తులు కోరితే దేవుడి మందిరాలు! : రెండేళ్ల పనితీరుపై రిపోర్టు విడుదల

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విచ్ఛిన్నకర వాతావరణం ఉండేదని, రాష్ట్రంలో దేవాలయాలకు సరైన ఆదరణ ఉండేది కాదని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. సచివాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో దేవాదాయశాఖ రెండేళ్ల పనితీరుపై ఆయన రిపోర్టు విడుదల చేశారు.

22, జూన్ 2026

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో ఎలక్ట్రికల్‌ హెల్పర్‌ మృతి
జిల్లా వార్తలు

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యంతో ఎలక్ట్రికల్‌ హెల్పర్‌ మృతి

చంద్రగిరి మండలం పనపాకం పంచాయతీలో ఎలక్ట్రికల్‌ హెల్పర్‌ నాగభూషణం ఎల్‌సీ తీసుకుని వీధిదీపాల మరమ్మతు చేస్తుండగా అకస్మాత్తుగా విద్యుత్‌ సరఫరా ప్రారంభమడంతో షాక్‌కు గురై కిందపడిపోయి మార్గమధ్యంలో మృతిచెందాడు. విద్యుత్‌ శాఖ నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఎల్‌సీ ఇచ్చిన తర్వాత ఎలా కరెంట్‌ వచ్చిందో విచారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

21, జూన్ 2026

వ్యవసాయ రంగానికి రూ.3,86,249కోట్ల రుణాలు : బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు
రాజకీయాలు

వ్యవసాయ రంగానికి రూ.3,86,249కోట్ల రుణాలు : బ్యాంకర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలోని 5వ బ్లాక్‌లో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ (SLBC) సమావేశం జరిగింది.

19, జూన్ 2026

పెట్టుబడుల ప్రాజెక్టులపై వేగంగా అడుగులు
ఆంధ్రప్రదేశ్

పెట్టుబడుల ప్రాజెక్టులపై వేగంగా అడుగులు

ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతిలో జరిగిన 18వ SIPB సమావేశంలో ఇంధన, ఐటీ, ఎలక్ట్రానిక్స్, పర్యాటక, మౌలిక సదుపాయాలు, పరిశ్రమల వంటి విభిన్న రంగాల్లో దాదాపు 50కి పైగా పెట్టుబడి ప్రాజెక్టు ప్రతిపాదనలను పరిశీలించి ఆమోదించారు. ప్రతిపాదిత ప్రాజెక్టుల వల్ల పెట్టుబడుల పరిమాణం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రాంతీయ సమతుల అభివృద్ధి అంశాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోగా, ఆమోదం పొందిన ప్రాజెక్టుల వివరాలు, అమలు దశలపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

18, జూన్ 2026

కోస్తాలో గ్రీన్‌ బెల్ట్ అభివృద్ధి! : డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
రాజకీయాలు

కోస్తాలో గ్రీన్‌ బెల్ట్ అభివృద్ధి! : డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష

కోస్తాతీర ప్రాంతాల్లో గ్రీన్‌ బెల్ట్ అభివృద్ధిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. ఏపీ సచివాలయంలో సామాజిక అడవుల పెంపకానికి తీసుకోవాల్సిన చర్యలపై అటవీ శాఖ అధికారులతో పవన్ సమావేశమయ్యారు.

18, జూన్ 2026

మొదట మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి
తెలంగాణ

మొదట మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి

ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అంటూ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. ఈ సవాల్‌పై సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మొదట ‘మోదీ హామీల లెక్క తేల్చండి.. ఆ తర్వాత నా రాజీనామా గురించి మాట్లాడండి’ అంటూ ప్రతి సవాల్ విసిరారు.

15, జూన్ 2026

గుంతకల్లులో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ
జిల్లా వార్తలు

గుంతకల్లులో తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ

అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని పాత గుంతకల్లులో ఆదర్శ నగర్‌లో తాళం వేసిన ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. కాశీ యాత్రకు వెళ్లిన రైల్వే ఉద్యోగి తిమ్మరాజు ఇంటి గేటు, తలుపుల తాళాలు పగులగొట్టి లోపలికి వెళ్లిన దొంగలు రూ.50 వేలు నగదు, 50 తులాల వెండి, 12 తులాల బంగారు ఆభరణాలను అపహరించగా, పోలీసులు కేసు నమోదు చేసి సీసీ కెమెరా దృశ్యాలు, వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.

11, జూన్ 2026

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం బాబు ఫోకస్!
ఆంధ్రప్రదేశ్

స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం బాబు ఫోకస్!

ఆంధ్రప్రదేశ్‌ను 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలకు తీసుకెళ్లేందుకు డేటా ఆధారిత పాలనకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు సీఎం నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి, కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్లపై సమీక్ష నిర్వహించి, శాఖల పనితీరును స్కోరింగ్ విధానంతో అంచనా వేసేలా, నెలనెలా ఆర్థిక నివేదికలు, ఏఐ టాస్క్‌ఫోర్స్, మౌలిక సదుపాయాలు, అమరావతి, పోలవరం, పోర్టులు, ఎయిర్ పోర్టుల అభివృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధిని గణనీయంగా పెంచాలని ఆయన దిశానిర్దేశం చేశారు.

9, జూన్ 2026

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు
రాజకీయాలు

గొడ్డలి పార్టీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారు: మంత్రి అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, వైసీపీ పాలనను ప్రజావ్యతిరేకం, రాక్షస పాలనగా అభివర్ణిస్తూ 2024 ఎన్నికల్లో ప్రజలు గొడ్డలి పార్టీ రాజకీయాలకు చరమగీతం పాడారని అన్నారు. జగన్ హయాంలో ప్రజాస్వామ్య వ్యవస్థ దెబ్బతిందని, రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లి అభివృద్ధి ఆగిపోయిందని ఆరోపిస్తూ, ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు.

4, జూన్ 2026

We Are Hiring – Anchors + Copywriters