రాయలసీమ న్యూస్, అనంతపురం: పామిడి, అనంతపురం జిల్లా: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి పామిడి మండలంలో ఏర్పాట్లు ముమ్మరం అయ్యాయి. ఎన్నికల నిర్వహణకు అవసరమైన పోలింగ్ కేంద్రాల తుది జాబితాను శనివారం మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయంలో ఎంపీడీవో ప్రభాకర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రభాకర్ మాట్లాడుతూ పామిడి మండలంలో మొత్తం 14 MPTC స్థానాలు ఉన్నాయని తెలిపారు. వీటిలో పామిడి పట్టణ పరిధిలో 6 MPTC స్థానాలు, గ్రామీణ ప్రాంత పరిధిలో 8 MPTC స్థానాలు ఉన్నాయని వివరించారు.
ఎన్నికల నిర్వహణ కోసం పామిడి పట్టణంలోని SC హాస్టల్‌లో ఒక MPTC స్థానానికి మూడు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో తెలిపారు. అలాగే పామిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఐదు MPTC స్థానాలకు 17 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలోని ఎనిమిది MPTC స్థానాలకు 26 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీవో ప్రభాకర్ తెలిపారు. మండల వ్యాప్తంగా మొత్తం 46 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసి ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.
పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవోలు అశ్వత్ నాయుడు, రంగనాయకులు, AO హరినాథ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికార యంత్రాంగం సమన్వయంతో ఏర్పాట్లు కొనసాగుతున్నాయని మండల కార్యాలయ వర్గాలు తెలిపాయి.













