భారత రాజ్యాంగంలోని 73వ సవరణ చట్టం, 1992 మరియు రాజ్యాంగంలోని ఆర్టికల్ 243K ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల వ్యవస్థ దేశవ్యాప్తంగా బలోపేతం చేయబడింది. ఈ నేపథ్యంలో రాష్ట్రాల ఎన్నికల కమిషన్లు, పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల విధానాలు, రిజర్వేషన్ వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించాయి. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ రాజ్ వ్యవస్థను బలపరిచినట్లే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్ల ద్వారా ప్రజాప్రతినిధుల ఎన్నికలు నిర్వహించే విధానంలో మార్పులు చోటు చేసుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో 2026లో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్ పరిపాలనా శాఖ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం మేయర్ , ఛైర్పర్సన్ పదవులకు ప్రజలు నేరుగా ఓటు వేసి ఎన్నుకునే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. 2026 సెప్టెంబర్ 6న వెలువడిన గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ఈ కొత్త నియమాలు అమలులోకి వచ్చాయి.

మున్సిపల్ ఎన్నికల్లో మూడు రకాల ప్రజాప్రతినిధులను ఎన్నుకుంటారు. వార్డు సభ్యులు (Councillor) ను ఆయా వార్డు ఓటర్లు ఎన్నుకుంటారు. కార్పొరేషన్‌లలో మేయర్ , మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఛైర్పర్సన్ ను ఆ పట్టణంలోని మొత్తం ఓటర్లు నేరుగా ఎన్నుకుంటారు. డిప్యూటీ మేయర్ , వైస్ - ఛైర్పర్సన్ లను అయితే గెలిచిన కౌన్సిలర్లు పరోక్షంగా ఎన్నుకుంటారు.

అభ్యర్థుల అర్హతల విషయంలో వయస్సు కనీసం 21 సంవత్సరాలు నిండి ఉండాలి. సంబంధిత మున్సిపాలిటీ ఓటర్ జాబితాలో పేరు ఉండాలి. ముగ్గురికి మించిన పిల్లలు ఉండకూడదు. మున్సిపాలిటీకి ఏ విధమైన బకాయిలు లేకపోవాలి.

నామినేషన్ దాఖలు సమయంలో రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో సమర్పించాల్సిన పత్రాల జాబితాను కూడా ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. వార్డు సభ్యుల కోసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్ర ప్రదేశ్ నిర్దేశించిన Form-B, మేయర్ , ఛైర్పర్సన్ ల కోసం ప్రత్యేక నామినేషన్ ఫారం ఉపయోగించాలి. రాజకీయ పార్టీ తరపున పోటీ చేస్తే Form-A, Form-B రెండూ సమర్పించాలి. Form-Aలో పార్టీ అధ్యక్షుడు సంతకం చేసిన అధికారిక అనుమతి లేఖ, Form-Bలో సంబంధిత వార్డుకు ఆ అభ్యర్థినే అధికార అభ్యర్థిగా ప్రకటించిన లేఖ ఉండాలి. ఇవి నామినేషన్ చివరి తేదీ మధ్యాహ్నం 3 గంటలలోపు సమర్పించకపోతే ఆ అభ్యర్థిని స్వతంత్ర అభ్యర్థిగా పరిగణిస్తారు.

ధృవీకరణ పత్రాలుగా ఓటర్ జాబితా ధృవీకరించిన ప్రతిలో అభ్యర్థి, ప్రపోజర్ పేర్లు ఉండాలి. ఆధార్, PAN కార్డు, రిజర్వేషన్ కేటగిరీకి సంబంధించిన కుల ధృవీకరణ పత్రం (MRO జారీ చేసినది), వయస్సు రుజువుకు SSC సర్టిఫికేట్ సమర్పించాలి. భద్రతా డిపాజిట్‌గా వార్డు సభ్యుల కోసం జనరల్ అభ్యర్థులు రూ.2,500, SC, ST, BC, మహిళా అభ్యర్థులు రూ.1,250 చెల్లించాలి. మేయర్ , ఛైర్పర్సన్ పదవులకు జనరల్ అభ్యర్థులు రూ.10,000, Reserved కేటగిరీ అభ్యర్థులు రూ.5,000 డిపాజిట్ చెల్లించాలి. చలానా ద్వారా ముందుగానే చెల్లించి, రశీదును నామినేషన్‌కు జత చేయాలి.

Form-26 అఫిడవిట్ తప్పనిసరి. నోటరీ లేదా ఓత్ కమీషనర్ సమక్షంలో ప్రమాణం చేసి సమర్పించాలి. ఇందులో అభ్యర్థి ఆస్తులు, అప్పులు, బ్యాంకు లోన్లు, క్రిమినల్ కేసులు, విద్యార్హత, PAN, పిల్లల సంఖ్య వంటి వివరాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలి. ఏ కాలమ్ ఖాళీగా వదిలితే నామినేషన్ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉన్నందున Nil లేదా నాట్ అప్లికబుల్ అని స్పష్టంగా నమోదు చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.

అదనంగా నో Dues సర్టిఫికెట్ ను సంబంధిత మున్సిపాలిటీ కమిషనర్ నుండి పొందాలి. మున్సిపాలిటీకి పన్ను బకాయిలు లేవని ఇందులో స్పష్టం చేయాలి. ప్రపోజర్‌గా అదే వార్డులోని ఓటర్ ఒకరు నామినేషన్ పత్రంపై సంతకం చేయాలి. మూడు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు జత చేయాలి. నామినేషన్ అనంతరం Scrutinyకు ముందు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది.

అభ్యర్థులకు అవసరమైన Form-A, Form-B, Form-26 వంటి ఫారాలు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆంధ్ర ప్రదేశ్ అధికారిక వెబ్‌సైట్ secap.nic.inలో Forms for మునిసిపల్ ఎలక్షన్ విభాగంలో అందుబాటులో ఉన్నాయి.

రిజర్వేషన్ వ్యవస్థలో భాగంగా మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఛైర్పర్సన్ పదవులకు సంబంధించిన షెడ్యూల్-II ప్రకారం ST, SC కేటగిరీలకు రిజర్వేషన్లు కేటాయించారు. ST కేటగిరీలో మొత్తం మూడు స్థానాలు ఉండగా గూడూరు (N) మున్సిపాలిటీ ఛైర్పర్సన్ పదవి 2026లో ST మహిళలకు, ఆళ్లూరు, ఆత్మకూరు (K) మున్సిపాలిటీల ఛైర్పర్సన్ పదవులు ST జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేశారు.

SC కేటగిరీలో మొత్తం 14 ఛైర్పర్సన్ స్థానాలు రిజర్వ్ చేశారు. చింతలపూడి, సూళ్లూరుపేట, కొండపల్లి, నిడదవోలు, ఏలేశ్వరం, గూటి, చీరాల మున్సిపాలిటీల ఛైర్పర్సన్ పదవులు 2026లో SC మహిళలకు కేటాయించారు. వుయ్యూరు, సామర్లకోట, పిఠాపురం, నూజివీడు, కుప్పం, పామూరు తదితర మున్సిపాలిటీల ఛైర్పర్సన్ పదవులు SC జనరల్ కేటగిరీకి రిజర్వ్ చేశారు. ఈ రిజర్వేషన్లు షెడ్యూల్-II ప్రకారం అమలులోకి రానున్నాయి.