రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్: విజయవాడ : ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్షన్ కమీషనర్ అనిల్ చంద్ర పునేఠా మీడియా సమావేశంలో వివిధ స్థానిక సంస్థల ఎన్నికల తేదీలను వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలక తేదీలను కమిషన్ ఖరారు చేసింది.
అక్టోబర్ 18న నామినేషన్లు దాఖలు చేయడానికి గడువు ఉండగా, అక్టోబర్ 19న నామినేషన్ల పరిశీలన చేపడతారు. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 21 వరకు అవకాశం కల్పించారు. అనంతరం తుది అభ్యర్థుల జాబితాను ప్రకటించి, ప్రచార కార్యక్రమాలకు పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలతోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల 28న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణ, ప్రచార కార్యక్రమాలు, అధికారుల బాధ్యతలపై కమిషన్ సూచనలు జారీ చేసినట్లు తెలియజేశారు.
విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) ఎన్నికలను అక్టోబర్ 28న నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన అక్టోబర్ 30న జరగనుంది.
ఆంధ్రప్రదేశ్లో మండల్ పరిషద్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యూఎంసీఎస్ (MPTC), జిల్లా పరిషద్ టెర్రిటోరియల్ కాన్స్టిట్యూఎంసీఎస్ (ZPTC) ఎన్నికలను 'నవంబర్ 3'న నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన నవంబర్ 5న జరగనుంది.
గ్రామీణ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు నిర్ణయించింది. మొదటి దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను 'నవంబర్ 26'న, రెండో దశను 'నవంబర్ 29న', మూడో దశను 'డిసెంబర్ 2'న నిర్వహించనున్నారు.







