ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందించే పలు ప్రభుత్వ సేవలను ఇకపై మన్ మిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్న నాలుగు కీలక సేవలను ఇకపై వాట్సాప్‌ ద్వారానే పొందే అవకాశం కల్పిస్తోంది.

మన్ మిత్ర వాట్సాప్ ద్వారా అందుబాటులోకి రానున్న సేవల్లో..

▪️ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్‌ రీ-ఇష్యూ
▪️ ఇన్‌కమ్ సర్టిఫికెట్‌ రీ-ఇష్యూ
▪️ పట్టాదారు పాస్‌బుక్‌ రీ-ప్రింట్
▪️ వాటర్ ట్యాక్స్‌ చెల్లింపు

వంటివి ఉన్నాయి.

ఈ సేవలను పొందాలంటే 9552300009 నంబర్‌కు వాట్సాప్‌లో మెసేజ్‌ పంపాలి. అనంతరం వాట్సాప్‌లో వచ్చే సూచనలను అనుసరించి అవసరమైన వివరాలను అందిస్తే సంబంధిత సేవలను పొందవచ్చు.

దీంతో ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే ప్రభుత్వ సేవలను పొందే అవకాశం ఉంటుంది. సేవలను వేగంగా, పారదర్శకంగా అందించడంతో పాటు డిజిటల్‌ గవర్నెన్స్‌ను మరింత ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.