రాయలసీమ న్యూస్, ఆంధ్రప్రదేశ్ డెస్క్:
మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలే.. నామినేషన్ డిపాజిట్, నియమావళిపై ప్రభుత్వం ఉత్తర్వులు
రాష్ట్రంలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగ్ Machines వినియోగించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు కార్పొరేషన్లలో మేయర్లు, కార్పొరేటర్ల ఎన్నికల నిర్వహణకు సంబంధించిన నియమావళిని ఖరారు చేస్తూ ప్రభుత్వం GO 211ను జారీ చేసింది.
ఈ ఉత్తర్వుల ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్లలో జరిగే ఎన్నికలన్నీ ఎలక్ట్రానిక్ వోటింగ్ Machines ద్వారానే నిర్వహించనున్నారు. ఓటర్ల సౌలభ్యం, ఫలితాల వేగవంతమైన లెక్కింపు, పారదర్శకత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు సూచిస్తున్నాయి.
నామినేషన్ డిపాజిట్ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. సాధారణ అభ్యర్థుల కోసం డిపాజిట్ మొత్తాన్ని ₹5 వేలు గా నిర్ణయించగా, షెడ్యూల్డ్ కాస్ట్ , షెడ్యూల్డ్ ట్రైబ్స్ , Backward క్లాస్స్ వర్గాల అభ్యర్థుల కోసం డిపాజిట్‌ను ₹2,500గా ఫిక్స్ చేసింది. ఈ మొత్తాలు నామినేషన్ దాఖలు సమయంలోనే చెల్లించాల్సి ఉంటుంది.
ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి సెట్‌కు అవసరమైన ప్రతిపాదకులు, సమర్థకుల వివరాలు పూర్తి స్థాయిలో జత చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నామినేషన్ పరిశీలన, ఉపసంహరణ, తుది జాబితా విడుదల తదితర ప్రక్రియలు ప్రస్తుత చట్టాల ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేశారు.
అభ్యర్థుల నేర చరిత్ర, ఆస్తులు, అప్పులు, విద్యార్హతల వివరాలపై అఫిడవిట్ సమర్పణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. నామినేషన్ పత్రంతో పాటు ఈ అఫిడవిట్‌ను జత చేయాలని, అందులో ఇచ్చే వివరాలు పూర్తి, నిజమైనవిగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్లు తేలితే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను మరింత పారదర్శకంగా, బాధ్యతాయుతంగా మార్చేందుకు ఈ నియమావళి దోహదం చేస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. GO 211 జారీతో మున్సిపల్ కార్పొరేషన్లలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక అంశాలు స్పష్టతకు వచ్చాయి.







