ముంబై: వయసు కేవలం సంఖ్య మాత్రమేనని మరోసారి చాటిచెప్పారు బాలీవుడ్‌ దిగ్గజ నటుడు అమితాబ్‌ బచ్చన్‌. ఎనభై ఏళ్లు దాటినా ఆయన పనితీరు, శ్రమ, అంకితభావం యువ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా ఉందని ఆయన తాజా బ్లాగ్‌ పోస్ట్‌ మరోసారి నిరూపించింది.

తాజాగా అమితాబ్‌ బచ్చన్‌ ఒకే రోజు 12 లఘు చిత్రాల షూటింగ్‌ పూర్తి చేసిన విషయాన్ని తన బ్లాగ్‌ ద్వారా వెల్లడించారు. అంతేకాకుండా, అదే రోజు రెండు స్టిల్‌ షూట్‌లను కూడా ముగించానని పేర్కొన్నారు. తన వయసులో ఇంత భారీ పని భారం నిర్వహించడం ఆయన అభిమానులను, సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

అమితాబ్‌ బచ్చన్‌ తన బ్లాగ్‌లో పలు ఫొటోలను పంచుకున్నారు. వాటికి ఆయన ఇచ్చిన క్యాప్షన్లు కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

అని ఆయన ఆ ఫొటోలకు క్యాప్షన్‌గా రాశారు. పరిస్థితులు ఎలా మారినా నేర్చుకోవడం ఆపకూడదని, పనిపై నిబద్ధత విషయంలో ఎప్పుడూ రాజీ పడకూడదనే సందేశాన్ని తన బ్లాగ్‌ ద్వారా పరోక్షంగా తెలియజేశారు.

సోషల్‌ మీడియాలో అమితాబ్‌ బచ్చన్‌ చురుకుగా ఉంటారు. తన రోజు వారీ పనులు, షూటింగ్‌ అనుభవాలు, వ్యక్తిగత ఆలోచనలు, జ్ఞాపకాలను తరచూ బ్లాగ్‌, ఇతర వేదికల ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. ఈ క్రమంలోనే ఒకే రోజు 12 లఘు చిత్రాల షూటింగ్‌ పూర్తి చేసిన విషయాన్ని వెల్లడించడంతో ఆయన క్రమశిక్షణ, వృత్తిపరమైన నిబద్ధతపై మరోసారి చర్చ మొదలైంది.

ప్రస్తుతం అమితాబ్‌ బచ్చన్‌ దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రూపొందిస్తున్న ‘కల్కి 2898 AD’ సీక్వెల్‌ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆయన కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రధాన చిత్రంతో పాటు సీక్వెల్‌ పనుల్లోనూ పాల్గొంటూ, ఇతర ప్రాజెక్టులతోనూ సమాంతరంగా ముందుకు సాగుతున్న అమితాబ్‌ బచ్చన్‌ పనితీరు సినీ వర్గాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.