దేశీయ బులియన్‌ మార్కెట్లలో మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల 24, 22, 18 క్యారెట్ల బంగారంపై 10 రూపాయల చొప్పున తగ్గుదల నమోదైంది. ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌ సెషన్‌లోనే ఈ తగ్గుదల కనిపించింది.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్‌ ప్రకారం, ఉదయం 6 గంటల సమయంలో హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,900 రూపాయల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,30,990 రూపాయలుగా, 18 క్యారెట్ల బంగారం ధర 1,01,170 రూపాయలుగా నమోదైంది.

తెలంగాణలోని ప్రముఖ పట్టణాల్లో 10 గ్రాముల బంగారం తాజా ధరలు ఈ విధంగా ఉన్నాయి. వరంగల్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 1,42,900 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 1,30,900 రూపాయలు, 18 క్యారెట్ల బంగారం ధర 1,07,170 రూపాయలు. ఖమ్మం, నిజామాబాద్‌ పట్టణాల్లో కూడా ఇదే రేట్లు కొనసాగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన పట్టణాల్లో కూడా బంగారం ధరలు పెద్దగా మార్పు లేకుండా స్వల్ప తగ్గుదలతోనే కొనసాగుతున్నాయి. కడపలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,42,900 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 1,30,990 రూపాయలు, 18 క్యారెట్ల బంగారం ధర 1,07,170 రూపాయలు. విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ పట్టణాల్లో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు స్వల్ప మార్పులతోనే ట్రేడవుతున్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,990 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం ధర 1,31,990 రూపాయలు, 18 క్యారెట్ల బంగారం ధర 1,10,190 రూపాయలు. ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 1,42,900 రూపాయలు, 22 క్యారెట్ల ధర 1,31,990 రూపాయలు, 18 క్యారెట్ల ధర 1,01,170 రూపాయలు.

ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,43,050 రూపాయలుగా, 22 క్యారెట్ల ధర 1,31,140 రూపాయలుగా, 18 క్యారెట్ల ధర 1,07,320 రూపాయలుగా ఉంది. కోల్‌కతా, బెంగళూరు, వడోదరా, ఇండోర్‌, కాన్పూర్‌ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర 1,42,900 రూపాయలు, 22 క్యారెట్ల ధర 1,31,990 రూపాయలు, 18 క్యారెట్ల ధర 1,01,170 రూపాయలుగా నమోదైంది.

బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌ ధోరణులు, రూపాయి మారకం విలువ, స్థానిక డిమాండ్‌ వంటి పలు అంశాలపై ఆధారపడి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. అందువల్ల నగలు కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు తాజా ధరలను మరోసారి పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పైన పేర్కొన్న ధరలు ఉదయం ట్రేడింగ్‌ సమయంలో నమోదైనవి మాత్రమే. రోజంతా మార్కెట్‌ పరిస్థితులపై ఆధారపడి రేట్లలో మార్పులు రావచ్చని బులియన్‌ వ్యాపారులు పేర్కొంటున్నారు.