స్థిరంగా బంగారం ధరలు

ప్రధాన నగరాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

దేశీయంగా బంగారం ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం జూన్ 26, 2026న ఉదయం 6 గంటల సమయానికి నమోదైన బంగారం, వెండి ధరలు పెద్దగా మార్పు లేకుండా ఉన్నాయి. అయితే వెండి ధరల్లో స్వల్ప తగ్గుదల కనిపించింది.

హైదరాబాద్, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,41,320గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,29,540గా నమోదైంది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు ఈ రెండు నగరాల్లో రూ.1,05,990గా ఉంది.

వెండి ధరలు మాత్రం కొద్దిగా తగ్గాయి. కిలో వెండి ధరలో సుమారు వంద రూపాయల మేర తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,34,900గా ఉంది.

తెలంగాణలోని ప్రధాన నగరాల్లో 10 గ్రాముల బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. హైదరాబాద్, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్‌లలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,320గా ఉంది. ఇదే నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,29,540గా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,05,990గా కొనసాగుతోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో కూడా బంగారం ధరలు దాదాపు ఒకే స్థాయిలో ఉన్నాయి. విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, నెల్లూరు, తిరుపతిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,320గా ఉంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,29,540గా, 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,05,990గా నమోదైంది.

దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధరలు పెద్దగా తేడా లేకుండా ఉన్నాయి. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,43,340గా, 22 క్యారెట్ల ధర రూ.1,31,390గా, 18 క్యారెట్ల ధర రూ.1,09,800గా ఉంది. ముంబై, కోల్‌కతా, బెంగళూరు, కేరళలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,41,320గా, 22 క్యారెట్ల ధర రూ.1,29,540గా, 18 క్యారెట్ల ధర రూ.1,05,990గా కొనసాగుతోంది.

న్యూఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,41,470గా, 22 క్యారెట్ల ధర రూ.1,29,690గా, 18 క్యారెట్ల ధర రూ.1,06,140గా ఉంది. అహ్మదాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,41,370, 22 క్యారెట్లకు రూ.1,29,590, 18 క్యారెట్లకు రూ.1,06,040గా నమోదైంది.

నిపుణులు బంగారం ధరలు అంతర్జాతీయ మార్కెట్‌, రూపాయి మారకం విలువ, స్థానిక డిమాండ్‌లపై ఆధారపడి ఎప్పటికప్పుడు మారుతుంటాయని సూచిస్తున్నారు. నగలు కొనుగోలు చేసే ముందు తాజా రేట్లను స్థానికంగా మరోసారి పరిశీలించడం మంచిదని ఆభరణాల వ్యాపారులు సూచిస్తున్నారు.