బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోవడం, అమెరికా డాలర్ బలపడటం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కఠిన వైఖరి కొనసాగవచ్చనే అంచనాల ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో కూడా బంగారం ధరలు క్షీణించాయి.

గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, గురువారం ఉదయం 10.00 గంటల సమయంలో హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,40,130గా ఉంది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల ఆర్నమెంటల్ బంగారం ధర రూ.1,28,450గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా తగ్గుదలను నమోదు చేశాయి (Silver prices today). ప్రస్తుతం హైదరాబాద్‌, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,30,000గా ఉంది.