రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్:
తెలంగాణ రాష్ట్రము సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలం బాచుపల్లి వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొన్న ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. విదేశాల నుంచి వస్తున్న బంధువును తీసుకొచ్చేందుకు నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న క్రమంలో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. క్షతగాత్రులను నారాయణఖేడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కల్హేర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







